లక్నో: ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) పని ఒత్తిడి వల్ల ఎన్నికల సిబ్బంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఒక బూత్ లెవర్ ఆఫీసర్ (బీఎల్వో)గా పని చేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు సూసైడ్ చేసుకున్నాడు. (UP Poll Officer Suicide) దీనికి ముందు తన పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలంటూ ఏడుస్తూ వీడియో సందేశంలో పేర్కొన్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. భోజ్‌పూర్‌లోని బహేది గ్రామంలో దళిత వర్గానికి చెందిన 46 ఏళ్ల సర్వేష్ కుమార్ ప్రభుత్వ స్కూల్లో టీచర్. అక్టోబర్ 7న ఓటర్ల జాబితాల సవరణకు సంబంధించిన ‘సర్’ పని కోసం బూత్ లెవర్ ఆఫీసర్ (బీఎల్వో)గా ఆయనను నియమించారు.
కాగా, ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలు, ఆధారాలకు సంబంధించిన పత్రాలు సేకరించడానికి కిందిస్థాయి ఎన్నికల అధికారి (బీఎల్వో)గా సర్వేష్ కుమార్‌కు పని అప్పగించడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో ఇచ్చిన పనిని సకాలంలో పూర్తి చేయలేకపోయాడు. ఆ ఒత్తిడిలో ఆదివారం తెల్లవారుజామున తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బీఎల్వో విధుల కారణంగా పని ఒత్తిడిని ఎదుర్కోలేకపోతున్నానని సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు.
మరోవైపు ఆత్మహత్యకు ముందు సర్వేష్ కుమార్ తన కుటుంబాన్ని ఉద్దేశించి ఒక వీడియో సందేశాన్ని రికార్డ్ చేశాడు. సర్ పనిని పూర్తి చేయడంలో విఫలమయ్యానని అందులో తెలిపాడు. ‘దీదీ, మమ్మీ నన్ను క్షమించు. దయచేసి నా పిల్లలను చూసుకోండి. ఈ ఎన్నికల పనిలో నేను విఫలమయ్యాను. నేను తీసుకునే ఈ నిర్ణయానికి నేను మాత్రమే బాధ్యత వహిస్తా. ఎవరి తప్పు లేదు. నేను చాలా బాధపడ్డాను. నేను 20 రోజులుగా నిద్రపోలేకపోతున్నా. నాకు సమయం ఉంటే ఈ పని పూర్తి చేసి ఉండేవాడిని. నాకు నలుగురు చిన్న కుమార్తెలు ఉన్నారు. దయచేసి నన్ను క్షమించండి. నేను మీ ప్రపంచానికి చాలా దూరం వెళ్తున్నా’ అంటూ కన్నీటిపర్యంతమయ్యాడు.
తనకు జీవించాలని ఉన్నదని, అయితే ‘సర్’ పని ఒత్తిడి చాలా ఎక్కువగా ఉన్నదని సర్వేష్ కుమార్ అందులో వాపోయాడు. ఈ వీడియో వెలుగులోకి రావడంతో ఆయన మరణానికి కారణమైన ఎన్నికల అధికారులపై చర్యలు తీసుకోవాలని కుటుంబం డిమాండ్ చేసింది.
‘मां, मैं जीना चाहता हूं, लेकिन…’
यूपी के मुरादाबाद जिले में SIR वर्क प्रेशर में जान देने वाले BLO सर्वेश सिंह का अपने आखिरी वीडियो में यह कहते हुए फूट-फूट कर रोते नजर आ रहे हैं. 30 नवंबर को BLO सर्वेश सिंह ने फंदे से लटककर अपनी जान दी थी. शिक्षक सर्वेश सिंह ने 3 पेज के… pic.twitter.com/LOPrQgtxyS
— NDTV India (@ndtvindia) November 30, 2025
Also Read:
SIR Deadline Extended | ‘సర్’ గడువు వారం రోజులు పొడిగింపు.. ఫిబ్రవరి 14న తుది జాబితా
14 Bills To Be Introduced | పార్లమెంట్లో 14 బిల్లులు ప్రవేశపెట్టనున్న కేంద్రం.. అవి ఏవంటే?
Watch: కస్టమర్‌గా నటించి.. బంగారు గొలుసులు ఎత్తుకెళ్లిన వ్యక్తి