SIR Deadline Extended | ‘సర్’ గడువు వారం రోజులు పొడిగింపు.. ఫిబ్రవరి 14న తుది జాబితా
SIR Deadline Extended | దేశంలోని 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితా సవరణ, క్లీన్అప్ కోసం చేపడుతున్న ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (సర్) గడువును ఎన్నికల సంఘం (ఈసీ) వారం రోజులు పొడిగించింది. దీంతో ఓటర్ల లెక్కింపు డిసెంబర్ 4కు బదులు డిసెంబర్ 11న ముగియనున్నది.
న్యూఢిల్లీ: దేశంలోని 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితా సవరణ, క్లీన్అప్ కోసం చేపడుతున్న ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (సర్) గడువును ఎన్నికల సంఘం (ఈసీ) వారం రోజులు పొడిగించింది. (SIR Deadline Extended) దీంతో ఓటర్ల లెక్కింపు డిసెంబర్ 4కు బదులు డిసెంబర్ 11న ముగియనున్నది. ‘సర్’ గడువు పొడిగింపు నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో డిసెంబర్ 9న విడుదల చేయాల్సిన ముసాయిదా ఓటర్ల జాబితాను డిసెంబర్ 16న విడుదల చేస్తారు. ఫిబ్రవరి 14న తుది జాబితా ప్రచురించనున్నట్లు ఈసీ తెలిపింది. ఆదివారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
కాగా, పలు రాష్ట్రాల్లో ప్రధానంగా పశ్చిమ బెంగాల్లో ‘సర్’ విధుల్లో ఉన్న ఎన్నికల అధికారులు, బూత్ స్థాయి ఎన్నికల సిబ్బంది పని ఒత్తిడి కారణంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో తక్కువ సమయం ఇచ్చి డెడ్‌లైన్ లోపు ‘సర్’ ప్రక్రియను పూర్తి చేయాలని ఎన్నికల అధికారులపై ఒత్తిడి చేస్తున్నారని ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు ఈసీపై మండిపడ్డాయి. ‘సర్’ ప్రక్రియను వాయిదా వేయాలని డిమాండ్ చేశాయి.
మరోవైపు తృణమూల్ కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీల నేతలు ఢిల్లీలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను కలిశారు. సర్ ప్రక్రియను రీ షెడ్యూల్ చేయాలని ఈసీని కోరారు. సోమవారం నుంచి ప్రారంభంకానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఉభయ సభలను ‘సర్’ అంశం కుదిపేయనున్నది. ఈ నేపథ్యంలో ‘సర్’ గడువును మరో వారం ఈసీ పొడిగించింది.
Also Read:
AAP leader Rajesh Gupta | బీజేపీలో చేరిన ఆప్ మాజీ ఎమ్మెల్యే.. కన్నీటితో కేజ్రీవాల్‌కు సలహా
Watch: కస్టమర్‌గా నటించి.. బంగారు గొలుసులు ఎత్తుకెళ్లిన వ్యక్తి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

