Online Scam | దేశంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. సొమ్ము కాజేసేందుకు నేరగాళ్లు కొత్త కొత్త దారులను వెతుక్కుంటున్నారు. సామాన్యులతోపాటూ సెలబ్రిటీలు కూడీ వీరి ఉచ్చులో పడి రూ.లక్షలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా ఓ ఎంపీ సైబర్ మోసానికి బలయ్యారు. ఆయన బ్యాంక్ అకౌంట్ నుంచి నేరగాళ్లు ఏకంగా రూ.50లక్షలు వరకూ కాజేశారు.
తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, నాలుగుసార్లు లోక్‌సభ ఎంపీ కల్యాణ్ బెనర్జీ సైబర్ మోసానికి బలయ్యారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎంపీ ఖాతాను సైబర్ నేరగాళ్లు నకిలీ పత్రాలను ఉపయోగించి యాక్సెస్ చేశారు. నకిలీ పాన్, ఆధార్ కార్డులను ఉపయోగించి మోసానికి పాల్పడ్డారు. అకౌంట్ నుంచి ఏకంగా రూ.56లక్షలు కాజేశారు. ఈ సొమ్మును వివిధ ఖాతాలకు తరలించడం, ఏటీఎమ్ ద్వారా విత్‌డ్రా చేయడంతోపాటూ ఆభరణాల కొనుగోళ్లకు ఉపయోగించినట్లు తేలింది. ఈ ఘటనపై అత్యవసర దర్యాప్తు కోరుతూ సైబర్ క్రైమ్ పోలీసులకు కోల్‌కతాలోని ఎస్బీఐ బ్రాంచ్ ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది.
Also Read..
Delhi Airport | సైబర్ దాడి..? సాంకేతిక సమస్యతో ఢిల్లీలో 300 విమానాలు ఆలస్యం
Jewellery | కళ్లలో కారం కొట్టి బంగారం చోరీకి యత్నం.. మహిళను చితకబాదిన దుకాణం యజమాని.. VIDEO