Delhi Airport | దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (Delhi Airport)లో సాంకేతిక సమస్య (technical glitch) తలెత్తిన విషయం తెలిసిందే. ఎయిర్‌పోర్ట్‌లోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (Air Traffic Control) సిస్టమ్‌లో ఈ సమస్య వచ్చింది. దీంతో విమానాల రాకపోకలకు (flights hit) అంతరాయం ఏర్పడింది. దాదాపు 300కిపైగా విమానాలు ప్రభావితమయ్యాయి. దీంతో వందలాది మంది ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్‌లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో అనేక విమానాలు నిలిచిపోయాయి. దీంతో రన్‌వేపై పార్కింగ్ స్థలం కూడా లేదు. దీంతో సాయంత్రం విమానాలను విమానయాన సంస్థలు రద్దు చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
తాజా సమస్యకు సైబర్ దాడే కారణంగా తెలుస్తోంది. గడచిన వారం రోజులుగా ఢిల్లీలో (Delhi) విమాన జీపీఎస్ (GPS) సిగ్నల్స్‌లో నకిలీ అలర్ట్స్ తరచూ కనిపిస్తున్నాయి. దీన్ని జీపీఎస్ స్పూఫింగ్ (GPS Spoofing) అని కూడా అంటారు. దీని కింద విమాన పైలట్లు తప్పుడు నేవిగేషన్ (దారిచూపే వ్యవస్థ) అందుకోవడం, ల్యాండింగ్ సమయంలో గందరగోళపరిచే హెచ్చరికలు రావడం జరుగుతోంది. ఇటువంటి సంఘటనలు ఢిల్లీకి 100 కిలోమీటర్ల వ్యాసార్థం లోపలే జరుగుతున్నట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వర్గాలు వెల్లడించాయి. స్పూఫింగ్ అనేది ఓ రకంగా సైబర్ దాడి లాంటిదే. నేవిగేషన్ సిస్టమ్స్‌ని తప్పుదారి పట్టించేందుకు బూటకపు జీపీఎస్ సిగ్నల్స్‌ని ఇది పంపుతుంది. సాధారణంగా వీటిని శత్రు సేనలకు చెందిన డ్రోన్లు, విమానాలను ధ్వంసం చేయడానికి యుద్ధ రంగంలో ఉపయోగిస్తుంటారు.
Also Read..
Jewellery | కళ్లలో కారం కొట్టి బంగారం చోరీకి యత్నం.. మహిళను చితకబాదిన దుకాణం యజమాని.. VIDEO