కోల్కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థుల జాబితాను తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మంగళవారం విడుదల చేశారు. ఇందులో 74 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు తిరస్కరించగా, 15 మందికి వేరే నియోజకవర్గాలు కేటాయించారు. 209 మంది ఎమ్మెల్యేల్లో 135 మంది తమ టికెట్లను తిరిగి దక్కించుకున్నారు.
ఈసారి టికెట్లు దక్కని వారిలో పార్థా చటర్జీ, వివేక్ గుప్తా, పరేశ్ పాల్, అసిత్ మజుందార్, చిరంజీట్, నటుడు కంచన్ ముల్లిక్ వంటి ప్రముఖులతో పాటు నలుగురు మంత్రులు తాజ్ముల్ హొస్సేన్, బిప్లబ్ రాయ్ చౌదరి, జ్యోత్స్నా మండి, మనోజ్ తివారీ ఉన్నారు. బీజేపీ విడుదల చేసిన జాబితాలో మొత్తం 70 మంది ఎమ్మెల్యేల్లో 8మందికి టికెట్లు తిరస్కరించింది.