భోపాల్: మధ్యప్రదేశ్లో ఒక శిక్షణ విమానం శనివారం కూలిపోయింది. అయితే పైలట్ శిక్షణ పొందుతున్న వ్యక్తితోపాటు శిక్షణ ఇస్తున్న వ్యక్తి సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. సాగర్ జిల్లాలోని ధన ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సింగిల్ ఇంజిన్ విమానం సెస్నా 172, ల్యాండ్ అవుతుండగా రన్ వే పక్కన కూలిపోయింది. చైమ్స్ ఏవియేషన్ అకాడమీకి చెందిన శిక్షణ విమానం కూలిపోవడం ఏడాదిన్నరలో ఇది రెండోసారి. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు.
#WATCH | Madhya Pradesh: A Cessna aircraft strayed off the runway at around 3 pm at Chimes Aviation Academy situated in the Dhana area of Sagar pic.twitter.com/vAQcBZZkSs
— ANI (@ANI) July 17, 2021