పాట్నా: రైలు పట్టాలు తనిఖీ చేసే రైల్వే ట్రాలీని రైలు ఢీకొట్టింది. దీంతో ట్రాలీ భాగం రైలు ఇంజిన్‌లో ఇరుక్కుపోయింది. ఈ ప్రమాదంలో ఒక రైల్వే కార్మికుడు మరణించాడు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. (Train- Inspection Trolley Collison) బీహార్‌లోని కతిహార్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం రైల్వే ట్రాలీలో ఉన్న నలుగురు రైల్వే సిబ్బంది రైలు పట్టాలను తనిఖీ చేస్తున్నారు. ఇంతలో అదే పట్టాలపై వచ్చిన అవధ్ ఎక్స్‌ప్రెస్ రైలు ఆ ట్రాలీని ఢీకొట్టింది. ప్రమాదం ధాటికి ట్రాలీలోని కొంత భాగం రైలు ఇంజిన్‌లో ఇరుక్కుపోయింది.
కాగా, ఈ ప్రమాదంలో ట్రాలీలోని ఒక రైల్వే కార్మికుడు మరణించాడు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన రైల్వే సిబ్బందిని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. రైలు ఇంజిన్‌లో ఇరుక్కున్న ట్రాలీ భాగాన్ని తొలగించారు. దీంతో కొంత ఆలస్యంగా ఆ రైలు అక్కడి నుంచి బయలుదేరింది.
మరోవైపు ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో క్లిప్‌ను బీహార్ కాంగ్రెస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘మోదీ ప్రభుత్వ హయాంలో రైలు ప్రమాదాలు ఆగకపోవడం చాలా ఆందోళన కలిగించే విషయం. ప్రయాణికులు భయం, భయాందోళనల మధ్య ప్రయాణించాల్సి వస్తోంది’ అని విమర్శించింది. ఏడాదిలో 98 రైలు ప్రమాదాలు జరిగాయని, 26 మంది ప్రాణాలు కోల్పోయారని, 171 మంది గాయపడ్డారని అందులో పేర్కొంది.
बिहार में फिर एक रेल हादसा हो गया है।
कटिहार में अवध-असम एक्सप्रेस एक ट्रॉली से टकरा गई, जिसमें एक ट्रॉलीमैन की मौत हो गई और कई मजदूर गंभीर रूप से घायल बताए जा रहे हैं।
हमारी ईश्वर से प्रार्थना है कि वे दिवंगत आत्मा को शांति दें और घायलों को शीघ्र स्वास्थ्य लाभ प्रदान करें।… pic.twitter.com/TQs68C9f6y
— Congress (@INCIndia) June 20, 2025
Also Read:
Watch: హైవేపై కారును ఈడ్చుకెళ్లిన లారీ.. తర్వాత ఏం జరిగిందంటే?