Doctor Rapes Minor patient | రోగి అయిన బాలికపై డాక్టర్ అత్యాచారం.. వైద్య విద్యార్థినిపై లైంగికదాడికి మరో వ్యక్తి యత్నం
Doctor Rapes Minor patient | రోగి అయిన మైనర్ బాలికపై డాక్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. అదే ప్రైవేట్ మెడికల్ కాలేజీ హాస్టల్లోకి రాత్రివేళ చొరబడిన వ్యక్తి వైద్య విద్యార్థినిపై లైంగికదాడికి యత్నించాడు. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో ఒకే రోజు ఈ రెండు సంఘటనలు జరిగాయి.
భోపాల్: రోగి అయిన మైనర్ బాలికపై డాక్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. (Doctor Rapes Minor patient) అదే ప్రైవేట్ మెడికల్ కాలేజీ హాస్టల్లోకి రాత్రివేళ చొరబడిన వ్యక్తి వైద్య విద్యార్థినిపై లైంగికదాడికి యత్నించాడు. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో ఒకే రోజు ఈ రెండు సంఘటనలు జరిగాయి. దేవాస్ జిల్లాలోని ఉజ్జయిని రోడ్లో అమల్తాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నది. రెండు నెలల కిందట 17 ఏళ్ల బాలిక తన తల్లిదండ్రులతో కలిసి వైద్య చికిత్స కోసం 35 ఏళ్ల డాక్టర్ రూపమ్ జైన్‌ను సంప్రదించింది.
కాగా, జూన్ 17న మెడికల్ చెకప్, కౌన్సెలింగ్ కోసం బాలికను ఆ ప్రైవేట్ ఆసుపత్రికి డాక్టర్ రూపమ్ జైన్ పిలిపించాడు. ఆ తర్వాత క్యాంపస్‌లోని తన నివాసానికి ఆమెను తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదుతో డాక్టర్ రూపమ్ జైన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోక్సో చట్టంతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే డాక్టర్ జైన్‌పై కొన్ని ఫిర్యాదులు రావడంతో జూన్ 5న అతడ్ని తొలగించినట్లు ఆ ప్రైవేట్ మెడికల్ కాలేజీ హాస్పిటల్ డైరెక్టర్ సురేష్ తెలిపారు.
మరోవైపు జూన్ 17న రాత్రివేళ అదే మెడికల్ కాలేజీ క్యాంపస్‌లోని లేడీ హాస్టల్లోకి ఒక వ్యక్తి ప్రవేశించాడు. ఒక రూమ్‌లో నిద్రిస్తున్న ఎంబీబీఎస్ విద్యార్థినిని కత్తితో బెదిరించి అత్యాచారానికి ప్రయత్నించాడు. అయితే సొమ్మసిల్లినట్లు ఆమె నటించింది. తాగు నీరు ఇవ్వాలని అడిగింది. ఆ వ్యక్తి వాటర్ తెచ్చేందుకు వెళ్లగా వైద్య విద్యార్థిని ఆ గది నుంచి బయటకు పరుగెత్తింది. మిగతా వారిని ఆమె అప్రమత్తం చేయగా అతడు తప్పించుకుని పారిపోయాడు. ఈ సంఘటనపై మెడికల్ స్టూడెంట్స్ నిరసన తెలిపారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:
Will Crash Plane | మహిళా వైద్యురాలు దురుసు ప్రవర్తన.. విమానాన్ని కూల్చివేస్తానని బెదిరింపు
Himanta Sarma | 5000 విదేశీ ఫేస్బుక్ ఖాతాలు అకస్మాత్తుగా యాక్టివ్: హిమంత
Watch: హైవేపై కారును ఈడ్చుకెళ్లిన లారీ.. తర్వాత ఏం జరిగిందంటే?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

