గౌహతి: అస్సాంలో సుమారు 5000 విదేశీ ఫేస్బుక్ ఖాతాలు అకస్మాత్తుగా యాక్టివ్ అయ్యాయని సీఎం హిమంత బిశ్వ శర్మ (Foreign Facebook Accounts) తెలిపారు. రాష్ట్రంలో త్వరలో జరుగనున్న ఎన్నికలకు ముందు విదేశీ ఫేస్బుక్ ఖాతాలు వెలుగులోకి రావడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం డిస్పూర్లోని లోక్ సేవా భవన్లో జరిగిన మీడియా సమావేశంలో హిమంత బిశ్వ శర్మ మాట్లాడారు. రాష్ట్రంలో సుమారు 5,000 ఫేస్బుక్ ఖాతాలు అకస్మాత్తుగా యాక్టివ్ అయ్యాయని తెలిపారు. ఇవి ఒక నిర్దిష్ట సమాజానికి సంబంధించినవి అని చెప్పారు. ఈ ఫేస్బుక్ ఖాతాలు ఎక్కువగా భారత్ బయట నుంచి నిర్వహిస్తున్నారని అన్నారు. ప్రధానంగా అస్సాం ఎన్నికలకు సంబంధించిన కంటెంట్‌ను షేర్ చేయడంతోపాటు ఒక నిర్దిష్ట రాజకీయ పార్టీని ప్రోత్సహిస్తున్నాయని వివరించారు.
కాగా, ఈ కొత్త ఫేస్బుక్ ఖాతాల విశ్వసనీయత కోసం ఐఐటీ గౌహతిని తమ లొకేషన్‌గా పేర్కొన్నారని సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు. వీటిని చెక్ చేయగా అలాంటి వ్యక్తులు అక్కడ లేరని తెలిసిందన్నారు. రెండు ఫేస్బుక్ ఖాతాలు బంగ్లాదేశ్, పాకిస్థాన్‌కు చెందినవిగా గుర్తించినట్లు చెప్పారు. ప్రజలను తప్పుదారి పట్టించేందుకు తప్పుడు గుర్తింపు, అడ్రస్ వినియోగిస్తున్నారని ఆరోపించారు. కొత్తగా సృష్టించిన ఈ ఫేస్బుక్ ఖాతాలతోపాటు వాటి వెనుక ఉన్న వ్యక్తులపై ప్రభుత్వం నిఘా పెట్టిందన్నారు.
Also Read:
Will Crash Plane | మహిళా వైద్యురాలు దురుసు ప్రవర్తన.. విమానాన్ని కూల్చివేస్తానని బెదిరింపు
Watch: హైవేపై కారును ఈడ్చుకెళ్లిన లారీ.. తర్వాత ఏం జరిగిందంటే?