Train | ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో రైలు (Train) పట్టాలపై సిలిండర్ పెట్టి రైలును పట్టాలు తప్పించేందుకు దుండగులు యత్నించిన ఘటన మరవక ముందే అలాంటి ఘటనే తాజాగా మరొకటి చోటు చేసుకుంది. రాజస్థాన్ (Rajasthan)లోని అజ్మీర్ (Ajmer)లో రైలు ప్రమాదానికి దుండగులు భారీ కుట్ర పన్నినట్లు తెలుస్తోంది.
పూలేరా – అహ్మదాబాద్ రూట్లో రైలు ట్రాక్‌పై దుండగులు సుమారు 70 కేజీల బరువైన సిమెంట్ దిమ్మెను (cement block) ఉంచారు. దీంతో రైలు సిమెంట్ దిమ్మెను ఢీ కొట్టుకుంటూ ముందుకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో రైలు ఇంజిన్‌తోపాటు కొంత భాగం దెబ్బతిన్నది. ఈ ఘటనపై లోకో పైలట్ ఆర్పీఎఫ్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ప్రమాద ప్రాంతంలో విరిగిన సిమెంట్ దిమ్మె భాగాలను గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కాగా, రెండు రోజుల క్రితం యూపీలో భివాండి-ప్రయాగ్‌రాజ్ కాళిందీ ఎక్స్‌ప్రెస్‌కు కాన్పూర్‌లో పెను ప్రమాదం తప్పిన విషయం తెలిసిందే. ట్రాక్‌పై ఉంచిన గ్యాస్ సిలిండర్‌ను రైలు ఢీకొంది. అయితే రైలుకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. రైలును పట్టాలు తప్పించడానికి జరిగిన విద్రోహ చర్యగా దీనిని భావిస్తున్నామని, ఘటనా స్థలిలో ఒక పెట్రోల్ బాటిల్, అగ్గిపెట్టెను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఆదివారం రాత్రి 8.20 గంటలకు రైలు అతివేగంతో వెళ్తుండగా, పట్టాలపై ఎల్పీజీ సిలిండర్ ఉండటాన్ని గమనించిన లోకో పైలెట్ ఎమర్జెన్సీ బ్రేకులు ప్రయోగించారు. అయినప్పటికీ రైలు సిలిండర్‌ను ఢీకొనడంతో అది పట్టాలకు దూరంగా ఎగిరిపడింది. ఘటనపై కేసు నమోదైందని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీస్ అధికారి చెప్పారు.
Also Read..
Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం
Audi Car: కార్లను, బైక్‌లను ఢీకొడుతూ.. బీజేపీ చీఫ్ కుమారుడి కారు బీభత్సం.. వీడియో