Tirumala | తిరుమలకు భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. శ్రీవారి ఉచిత సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. ఉచిత సర్వదర్శనం కోసం 4 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఇక టైమ్ స్లాట్ (ఎస్ఎస్డీ) దర్శనానికి 3 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా.. శ్రీవారి దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది. రూ. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది.
సోమవారం నాడు తిరుమల శ్రీవారిని 67,030 మంది భక్తులు దర్శించుకున్నారు. 23,476 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.60 కోట్లుగా ఉంది.