Junior Doctors | ఇది ప్రజా ఉద్యమం.. న్యాయం దక్కేవరకు ఆందోళనలు ఆపేది లేదు: కోల్కతా జూనియర్ డాక్టర్లు
కోల్కతాలోని ఆర్జీకర్ దవాఖానలో ట్రైనీ డాక్టర్ హత్యాచారానికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటాన్ని ఎట్టిపరిస్థితుల్లో ఆపేది లేదని జూనియర్ డాక్టర్లు (Junior Doctors) స్పష్టం చేశారు. తమది ప్రజా ఉద్యమమని.. దీనిని ప్రభుత్వం కానీ, సుప్రీంకోర్టు కానీ మరచిపోకూడదని వెల్లడించారు.
కోల్కతా: కోల్కతాలోని ఆర్జీకర్ దవాఖానలో ట్రైనీ డాక్టర్ హత్యాచారానికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటాన్ని ఎట్టిపరిస్థితుల్లో ఆపేది లేదని జూనియర్ డాక్టర్లు (Junior Doctors) స్పష్టం చేశారు. తమది ప్రజా ఉద్యమమని.. దీనిని ప్రభుత్వం కానీ, సుప్రీంకోర్టు కానీ మరచిపోకూడదని వెల్లడించారు. ఆందోళనలు చేస్తున్న వైద్యులు మంగళవారం సాయంత్రం 5 గంటల్లోపు విధుల్లోకి చేరాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. లేనట్లయితే కఠిన చర్యలు తప్పవని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రల ధర్మాసనం సోమవారం హెచ్చరించింది. ఏ నిరసనైనా, ఆందోళనైనా.. విధులను విస్మరించి చేయడం సరికాదు. తక్షణమే విధుల్లోకి చేరాలి. రోగులకు సేవలందించాలి. క్షేత్రస్థాయిలో ఏం జరిగిందో మాకు తెలుసు. మీ భద్రతకు పూచీగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు ఉంటారు. మంగళవారం సాయంత్రం 5 గంటల్లోపు విధులకు హాజరైన వారిపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలు ఉండవు. కొనసాగిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని ధర్మాసనం స్పష్టం చేసింది.
దీనిపై స్పందించిన జూనియర్ డాక్టర్లు.. సుప్రీంకోర్టు తీర్పు తమను నిరాశకు గురిచేసిందన్నారు. కేసును హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు, పశ్చిమ బెంగాల్ పోలీసుల నుంచి సీబీఐకీ బదిలీ చేశారు. అయినా ఇప్పటికీ న్యాయం దక్కలేదని చెప్పారు. దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని రాష్ట్రం ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తున్నదని ఆరోపించారు. ఆందోళనల కారణంగా రాష్ట్రంలో వైద్య వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో పడిందని, సకాలంలో వైద్యం అందక 23 మంది ప్రాణాలు కోల్పోయారని, చికిత్స అందక 6 లక్షల మంది రోగులు ఇబ్బంది పడుతున్నారని చెప్పడం పూర్తిగా అబద్ధమని తెలిపారు. తమకు న్యాయం లభించేవరకు నిరసన కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు.
గత నెల 9న కోల్కతాలోని ఆర్జీ కర్ ప్రభుత్వ కళాశాల ఆసుపత్రిలో 31 ఏళ్ల జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం జరిగిన సంగతి తెలిసిందే. దీంతో వైద్యుల ఆందోళనలతో రాష్ట్రం అట్టుడికిపోతున్నది. కాగా, ఈ సంఘటనను సుమోటోగా తీసుకొని సుప్రీంకోర్టు విచారణ జరుపుతున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

