Audi Car: కార్లను, బైక్లను ఢీకొడుతూ.. బీజేపీ చీఫ్ కుమారుడి కారు బీభత్సం.. వీడియో
Audi Car: నాగపూర్లో ఆడీ కారు బీభత్సం సృష్టించింది. కార్లను, బైక్లను ఢీకొట్టుతూ వెళ్లింది. ఈ ఘటనకు చెందిన వీడియో ఒకటి వైరల్ అవుతున్నది. అయితే ఆ కారు మహారాష్ట్ర బీజేపీ చీఫ్ కుమారుడి పేరిట రిజిస్టర్ అయినట్లు తెలుస్తోంది.
ముంబై: మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రశేఖర్ భవంకులే కుమారుడు సంకేత్ భవంకులే.. తన కారుతో బీభత్సం సృష్టించాడు. నాగపూర్లో జరిగిన ఘటనకు చెందిన వీడియో వైరల్ అవుతున్నది. ఆడి కారుతో(Audi Car) రోడ్డుపై మరో కారును ఢీకొట్టాడు. టూ వీలర్ వాహనాన్ని కూడా ఢీకొట్టుతూ వెళ్లాడు. 14 సెకన్లు ఉన్న ఓ క్లిప్.. ప్రస్తుతం వైరల్ అవుతున్నది. రాత్రి ఒంటి గంటకు ఈ ప్రమాదం జరిగింది. ఆడి కారులో అయిదుగురు వ్యక్తలు ఉన్నట్లు తెలిసింది. సంకేత్తో పాటు ముగ్గురు పరారీ అయ్యారు. కారు డ్రైవర్తో పాటు మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీర్ బార్ నుంచి వస్తున్న సమయంలో ఆడీ కారు బీభత్సం సృష్టించింది. అరెస్టు చేసిన వ్యక్తుల నుంచి రక్తపు శ్యాంపిళ్లను తీసుకున్నారు.
బైక్ను ఢీకొన్న ఘటనలో.. ఆ బైక్ వ్యక్తులు గాయపడ్డారు. వాహనాలను ఢీకొన్న తర్వాత మానక్పూర్ బ్రిడ్జ్ వద్ద ఆడీ కారు ఆగిపోయింది. సరిగ్గా సెంటర్ పాయింట్ హోటల్ వద్ద ప్రమాదం జరిగింది. ఈ ఘటన పట్ల కేసు రిజిస్టర్ చేసినట్లు ఇన్స్పెక్టర్ అనామికా మీర్జాపూర్ తెలిపారు. అరెస్టు చేసిన నిందితుల్ని అర్జున్ హవ్రే, రోనిత్ చిత్తంవార్గా గుర్తించారు. ఆ ఆడీ కారు తన కుమారుడి పేరిట రిజిస్టర్ అయి ఉన్నట్లు మహారాష్ట్ర బీజేపీ చీఫ్ అంగీకరించారు. నిష్పక్షపాతంగా దర్యాప్తు చేపట్టి, నిందితుల్ని అరెస్టు చేయాలని పోలీసుల్ని కోరారు.
Breaking!🚨
Maharashtra BJP President Chandrashekhar Bawankule’s Son’s Audi car hits multiple cars late night in Nagpur
Police arrested two people & released on bail, They got bail like instant noodles 🍜 🤯#NagpurAudiCarAccident #Mumbai pic.twitter.com/zW5FWCK4WC
— Veena Jain (@DrJain21) September 10, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Destiny | నందినీ రెడ్డి చేతుల మీదుగా ‘డెస్టినీ’ ఫస్ట్ లుక్ లాంచ్.. ఇంట్రెస్టింగ్గా ఇమ్మాన్యుయేల్ లుక్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

