ఆదివారం 27 సెప్టెంబర్ 2020
National - Aug 05, 2020 , 22:17:57

ఆకాశంలా మారిన నది..!

ఆకాశంలా మారిన నది..!

కోయంబత్తూర్‌: నది ఆకాశంలా మారిపోయిందా..?  తెల్లని మేఘాలు భూమిపైకి వచ్చాయా? అన్నట్టుగా మారిపోయింది తమిళనాడు రాష్ట్రంలోని ఓ నది. అయితే, దానికి వెనుక భయంకరమైన రహస్యం ఉందట. ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి నదిలో పెద్ద మొత్తంలో నీరు చేరడం.. అందులోకి సమీప పరిసరాల్లోని పరిశ్రమ వ్యర్థాలు రావడంతో విష వాయువుల ప్రభావంవల్ల తెల్లని నురగ ఏర్పడి, కొన్ని కిలోమీటర్ల దూరం తేలియాడుతూ కనిపిస్తోందట. 

తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూర్‌లోని నొయ్యల్‌ నదిలో కనిపించింది ఈ దృశ్యం. అయితే, దీన్ని చూసి పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. విషవాయుల ప్రభావం వల్లే ఇలా జరిగిందని, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇంత పెద్ద మొత్తంలో నురగ ఏర్పడడం 50 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారని పేర్కొన్నారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo