Gold | పాట్నా: బీహార్లోని ఒక గ్రామంలో టన్నుల కొద్దీ బంగారం భూమిలో నిక్షిప్తమై ఉన్నదని వార్తలు రావడంతో అధికారులు అన్వేషణ ప్రారంభించారు. బంకా జిల్లా ఖెర్వార్లో మెరుపురాళ్లు లభ్యమవుతుండేవి. ఏరియల్ సర్వే పూర్తి చేసిన జీఎస్ఐ ఇక్కడ వేల టన్నుల బంగారం లభించవచ్చని భావిస్తున్నది.
ఐదు రోజుల క్రితమే ప్రారంభమైన తవ్వకాలు 650 అడుగుల లోతు వరకు సాగుతాయని అధికారి ఒకరు తెలిపారు. ఇప్పటివరకు 50, 60 అడుగుల వరకు జరిపిన తవ్వకాలలో కొన్ని మెరుపు రాళ్లు, బంగారు రాళ్లు లభించాయన్నారు. వాటిని పరీక్ష నిమిత్తం జీఎస్ఐ ల్యాబరేటరీకి పంపామన్నారు.