e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, July 29, 2021
Home జాతీయం కారు నుంచి రోడ్డుపై పడిన బాలుడు.. తర్వాత ఏమైందంటే..

కారు నుంచి రోడ్డుపై పడిన బాలుడు.. తర్వాత ఏమైందంటే..

కారు నుంచి రోడ్డుపై పడిన బాలుడు.. తర్వాత ఏమైందంటే..

న్యూఢిల్లీ: సిగ్నల్‌ వద్ద కదులుతున్న కారు వెనుక నుంచి ఒక బాలుడు రోడ్డుపై పడ్డాడు. గమనించిన మిగతా వాహనదారులు ఆ బాలుడికి ప్రమాదం జరుగకుండా ఉండేందుకు తమ వాహనాలను నిలిపివేశారు. ఇంతలో ఆ బుడతడు లేచి రోడ్డుపై పరుగెత్తసాగాడు. స్కూటర్‌పై వెళ్తున్న ఒక మహిళ ఆ బాలుడ్ని పట్టుకుని నిలువరించింది. మరోవైపు బాలుడు కింద పడిన కారు నుంచి దిగిన ఒక మహిళ పరుగెత్తుకొని వచ్చి అతడ్ని ఎత్తుకుని తీసుకెళ్లింది. ఆ బాలుడికి ఏమీ జరుగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.  

ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద ఉన్న సీసీటీవీలో రికార్డైన ఈ వీడియోను ద సన్‌ తొలుత ప్రసారం చేయగా షిరిన్ ఖాన్ అనే మహిళ మంగళవారం తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ఇలా కూడా జరుగుతుందా అని ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగింది అన్నది తెలియలేదు. కాగా, ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది. బాలుడికి ఎలాంటి ప్రమాదం జరుగకపోవడంపై నెటిజన్లు ఊరట చెందారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కారు నుంచి రోడ్డుపై పడిన బాలుడు.. తర్వాత ఏమైందంటే..
కారు నుంచి రోడ్డుపై పడిన బాలుడు.. తర్వాత ఏమైందంటే..
కారు నుంచి రోడ్డుపై పడిన బాలుడు.. తర్వాత ఏమైందంటే..

ట్రెండింగ్‌

Advertisement