న్యూఢిల్లీ: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) నుంచి తమిళనాడుకు మినహాయింపునిచ్చే బిల్లును నిలిపి ఉంచిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తమిళనాడు అడ్మిషన్ టు అండర్గ్రాడ్యుయేట్ మెడికల్ డిగ్రీ కోర్సెస్ బిల్లు, 2021ని శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించిందని తెలిపింది.
దీనిని ఆమోదించకుండా, నిలిపి ఉంచాలని రాష్ట్రపతి తీసుకున్న నిర్ణయం వల్ల రాజ్యాంగ ప్రతిష్టంభన ఏర్పడినట్లు పేర్కొంది. నీట్ పట్టణ, సంపన్న, సీబీఎస్ఈ విద్యా సంస్థల్లో చదువుకున్న వారికి అనుకూలంగా, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వారికి ప్రతికూలంగా ఉందని ఆరోపించింది.