న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా బీజేపీపై ఆదివారం మరింత తీవ్రంగా విరుచుకుపడ్డారు. లంచం తీసుకుని లోక్సభలో ప్రశ్నలు అడిగినట్లు తనపై వచ్చిన ఆరోపణలపై క్రిమినల్ కేసులు పెట్టే యోచనలో బీజేపీ ఉందని ఓ ట్వీట్ చేశారు. తనకు ఎన్ని జతల చెప్పులు ఉన్నాయో అడగడానికి ముందు బొగ్గు కుంభకోణంలో అదానీ మీద కేసు పెట్టాలన్నారు. పార్లమెంటు ఎథిక్స్ కమిటీ విచారణలో కమిటీ చైర్మన్ వినోద్ సోన్కర్ తనతో, ప్రతిపక్ష ఎంపీలతో మాట్లాడిన మాటలన్నీ రికార్డయి ఉన్నాయని చెప్పారు. తప్పుడు ఆరోపణలతో మహిళా ఎంపీలను బయటకు తోసేయడానికి ముందు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.