శనివారం 11 జూలై 2020
National - May 02, 2020 , 07:20:39

రైతుల‌పై దాడి చేసిన పులి..వీడియో

రైతుల‌పై దాడి చేసిన పులి..వీడియో

యూపీ : ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని పిలిభిత్ జిల్లాలో ఓ పులి వీరంగం సృష్టించింది. వ్య‌వ‌సాయ‌క్షేత్రంలో ధాన్యాన్ని తీసుకువెళ్లేందుకు ముగ్గురు రైతులు ట్రాక్ట‌ర్ పై వెళ్లారు. అయితే హ‌ఠాత్తుగా పులి పొద‌ల్లో నుంచి దూసుకొచ్చి..ట్రాక్ట‌ర్ పై ఉన్న ముగ్గురు రైతులపై దాడి చేశారు. అయితే రైతులు అప్ర‌మ‌త్త‌మై పొడ‌వాటి క‌ర్ర‌ల సాయంతో ఆ పులిని అడ్డుకుని పారిపోయేలా చేశారు.

పులి దాడిలో రైతుల‌కు గాయాల‌య్యాయి. ట్రాక్ట‌ర్ కు కొంతదూరంలో వాహ‌నం నిలిపిన వారు ఈ ఘ‌టనను వీడియో తీసి..సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. రైతుల ఫిర్యాదు మేర‌కు రంగంలోకి దిగిర ఫారెస్ట్ అధికారులు పులి ఆచూకీని తెలుసుకునే ప‌నిలో ప‌డ్డార‌ని ఫిలిబిత్ జిల్లా మేజిస్ట్రేట్ వైభ‌వ్ శ్రీవాత్స‌వ తెలిపారు. 

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo