Bomb Threat | దేశంలో బాంబు బెదిరింపులు (Bomb Threat) మరోసారి కలకలం రేపుతున్నాయి. రెండు రోజుల క్రితం తమిళనాడులోని రెండు పాఠశాలలకు, నిన్న ముంబైలోని ఓ పాఠశాలకు ఇలాంటి బెదిరింపులే వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా గుజరాత్ రాష్ట్రంలోని మూడు పాఠశాలలకు బెదిరింపులు వచ్చాయి.
VIDEO | Gujarat: Vadodara’s Navrachana Higher Secondary School receives bomb threat over email. Police and bomb squad at the spot. More details are awaited.#Vadodara #gujaratnews
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/u0PiZoOQmm
— Press Trust of India (@PTI_News) January 24, 2025
వడోదర (Vadodara)లోని నవరచన స్కూల్ (Navrachana School) సహా మొత్తం మూడు పాఠశాలలకు శుక్రవారం ఉదయం ఈ బెదిరింపులు వచ్చాయి. దుండగులు ఈమెయిల్ ద్వారా ఈ బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ బెదిరింపు మెయిల్‌తో అప్రమత్తమైన ఆయా పాఠశాలల యాజమాన్యాలు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు పాఠశాలల్లోని విద్యార్థులను, సిబ్బందిని వెంటనే బయటకు పంపించారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాల సాయంతో ఆయా పాఠశాలల్లో తనిఖీలు చేపట్టారు. అయితే, ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలూ, అనుమానాస్పద వస్తువులూ కనిపించలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న వడోదర పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
#WATCH | Vadodara, Gujarat | Dog Squad reaches Navrachna International School in the Bhayali area which received a bomb threat through email. pic.twitter.com/VD2wmu6lbw
— ANI (@ANI) January 24, 2025
Also Read..
Manish Sisodia | జైల్లో ఉన్నప్పుడు నాకు సీఎం పదవి ఆఫర్ చేశారు.. బీజేపీపై సిసోడియా సంచలన ఆరోపణలు
Maha Kumbh | కుంభమేళాకు పోటెత్తుతున్న భక్తులు.. 10 కోట్ల మంది పుణ్యస్నానాలు
FIITJEE Coaching Centers: యూపీ, ఢిల్లీలో ఫిట్జ్ కోచింగ్ కేంద్రాలు మూసివేత