ఢిల్లీ, ఫిబ్రవరి 24: భారత్లో క్యాన్సర్ కోరలు చాస్తున్నది. ఈ మహమ్మారి బారినపడిన ప్రతి ఐదుగురిలో ముగ్గురు మృత్యువాత పడుతున్నారు. అదే సమయంలో అమెరికాలో ప్రతి నలుగురిలో ఒకరు మరణిస్తుండగా.. చైనా అత్యధికంగా ప్రతి ఇద్దరిలో ఒకరు మృత్యువాత పడుతున్నారు. ఈ మేరకు ‘ది లాన్సెట్ రీజినల్ హెల్త్ సౌత్ ఈస్ట్ ఆసియా’ జర్నల్లో అధ్యయన వివరాలు ప్రచురితమయ్యాయి. ఐసీఎంఆర్ అధ్యయనం ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసుల్లో భారత్ మూడోస్థానంలో ఉంది. కేసుల పరంగా చైనా, అమెరికా వరుసగా తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే చైనా తర్వాత భారత్లో అత్యధికంగా 10 శాతం మరణాలు సంభవిస్తున్నాయి. భారత్లో పురుషులతో పోలిస్తే మహిళలు ఎక్కువగా క్యాన్సర్ బారిన పడుతుండటం, మహిళలే అత్యధికంగా మరణిస్తుండటం గమనార్హం. భారత్లో జనాభా పెరిగేకొద్ది ఏటా 2 శాతం కేసుల పెరుగుదల నమోదవుతున్నదని, కాబట్టి రాబోయే రెండు దశాబ్దాలు భారత్కు సవాళ్లు తప్పవని పరిశోధకులు తెలిపారు. ఈ నేపథ్యంలో క్యాన్సర్ నివారణపై దృష్టిసారించాల్సిన అవసరాన్ని ఈ అధ్యయనం నొక్కిచెప్తున్నది.
మరణాల పరంగా
1st: చైనా
2nd: భారత్
క్యాన్సర్ కేసుల్లో మొదటి మూడు దేశాలు
మహిళల్లో కొత్త కేసులు
మహిళల్లో మరణాలు
పురుషుల్లో కొత్త కేసులు
మహిళలు, పురుషులపై ఎక్కువగా ప్రభావం చూపుతున్న ఐదు రకాల క్యాన్సర్లు:
రొమ్ము క్యాన్సర్, గర్భాశయ, నోటి, ఊపిరితిత్తులు, అన్నవాహిక
మొత్తం క్యాన్సర్ కేసుల్లో వీటి వాటావయసుల వారీగా..