Arvind Kejriwal | మద్యం పాలసీ కేసులో ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు 15 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. కోర్టు తీర్పుతో ఆయన నేటి నుంచి ఏప్రిల్ 15వ తేదీ వరకూ తీహార్ జైలులో ఉండనున్నారు. ఈ నేపథ్యంలో జైల్లో (jail) తనకు కొన్ని వసతులు కల్పించాలంటూ కేజ్రీవాల్ కోర్టును కోరారు. జ్యుడీషియల్ కస్టడీలో చదవడానికి మూడు పుస్తకాలు (Three books), మందులు, ప్రత్యేక ఆహారం ఇలా మొత్తం ఐదు అభ్యర్థనలను కోర్టు ముందు ఉంచారు.
కస్టడీలో చదువుకునేందుకు మూడు పుస్తకాలు చదువుకునేందుకు కేజ్రీవాల్‌కు అనుమతి ఇవ్వాలని న్యాయవాదులు కోరారు. భగవద్గీత, రామాయణం, హౌ ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్ అన్న పుస్తకాలు కేజ్రీవాల్ చదువుకుంటారని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టులో తెలిపారు. అదేవిధంగా ఆయన ఆరోగ్యం దృష్ట్యా.. ప్రత్యేక డైట్ అందించాలని, జైల్లోకి మందులు అనుమతించాలని కోరారు. జైల్లో మతపరమైన లాకెట్ ధరించేందుకు అనుమతి, వీటితోపాటు ఒక కుర్చీ, టేబుల్ అనుమతించాలని కోర్టును అభ్యర్థించారు. ఈ మేరకు కేజ్రీ తరఫున న్యాయవాదులు కోర్టులో దరఖాస్తు చేశారు.
Also Read..
Crime news | దారుణం.. భార్యాపిల్లలను హతమార్చి.. మూడు రాత్రులు శవాలతోనే గడిపి..!
Arvind Kejriwal | లిక్కర్ కేసులో తీహార్ జైలుకు కేజ్రీవాల్.. 15 రోజులు జ్యుడీషియల్ రిమాండ్
Heavy Storm | బలమైన తుఫాను కారణంగా పడవబోల్తా.. ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు మృతి