Crime news | దారుణం.. భార్యాపిల్లలను హతమార్చి.. మూడు రాత్రులు శవాలతోనే గడిపి..!
Crime news | అనుమానం పెనుభూతమైంది. పచ్చని కాపురాన్ని కకావికలం చేసింది. భార్యపై అనుమానంతో ఓ వ్యక్తి ఆమెను హత్య చేశాడు. ఈ హత్యకు పిల్లలు సాక్ష్యం చెబుతారనే అనుమానంతో వాళ్లను కూడా హతమార్చాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నో జిల్లాలోని బిజ్నోర్ ఏరియాలోగల శరవణ్ నగర్ ఏరియాలో దారుణ ఘటన చోటుచేసుకుంది.
Crime news : అనుమానం పెనుభూతమైంది. పచ్చని కాపురాన్ని కకావికలం చేసింది. భార్యపై అనుమానంతో ఓ వ్యక్తి ఆమెను హత్య చేశాడు. ఈ హత్యకు పిల్లలు సాక్ష్యం చెబుతారనే అనుమానంతో వాళ్లను కూడా హతమార్చాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నో జిల్లాలోని బిజ్నోర్ ఏరియాలోగల శరవణ్ నగర్ ఏరియాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇంటి యజమాని ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
వివరాల్లోకి వెళ్తే.. రామ్‌లగన్ అనే 32 ఏళ్ల వ్యక్తి భార్య జ్యోతి (30), పిల్లలు పాయల్ (6), ఆనంద్ (3) తో కలిసి శరవణ్ నగర్ ఏరియాలోని ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో భార్య తరచూ ఫోన్లో మాట్లాడుతుడంపై రామ్లగన్లో అనుమానం మొదలైంది. భార్య ఎంతచెప్పినా వినకపోవడంతో ఇద్దరి మధ్య గొడవలు షురువయ్యాయి. ఈ క్రమంలోనే మార్చి 28న రాత్రి ఇద్దరూ గొడవపడ్డారు.
గొడవ ముదరడంతో ఆమె మెడలో ఉన్న స్కార్ఫ్‌తో ఉరి బిగించి చంపాడు. పిల్లల కళ్ల ముందే ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఆ తర్వాత వారి తల్లిని తానే చంపినట్లు సాక్ష్యం చెబుతారనే భయంతో ఇద్దరు పిల్లలను కూడా హత్య చేశాడు. అనంతరం రాత్రంతా ఆ ముగ్గురి మృతదేహాల పక్కనే గడిపాడు. ఉదయం ఎప్పటిలాగే విధులకు వెళ్లి సాయంత్రం తిరిగొచ్చి పడుకున్నాడు.
ఇరుగు భార్య, పిల్లల గురించి ఆరా తీయంగా హోలి పండుగకు తల్లిగారింటికి వెళ్లారని, ఇంకా రాలేదని చెప్పాడు. వరుసగా మూడు రాత్రులు అదేవిధంగా పగలు బయటికి వెళ్లడం, రాత్రికి వచ్చి మృతదేహాల పక్కనే పడుకోవడం చేశాడు. నాలుగోరోజు ఇంటి నుంచి దుర్వాసన రావడం, తలుపులు తీసి ఉండటంతో ఇంటి యజమాని లోపలికి వెళ్లిచూశాడు. లోపల తల్లిముగ్గురూ విగతజీవులుగా పడివుండటం చూసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
సమాచారం అందిన వెంటనే ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

