మంగళవారం 01 డిసెంబర్ 2020
National - Nov 02, 2020 , 09:05:47

సెల్‌ఫోన్‌ను ఫుట్‌బాల్‌లా ఆడేశాడు..వీడియో వైరల్‌!

సెల్‌ఫోన్‌ను ఫుట్‌బాల్‌లా ఆడేశాడు..వీడియో వైరల్‌!

సెల్‌ఫోన్‌ను ఫుట్‌బాల్‌లా ఆడేయడమేంటని ఆశ్చర్యపోతున్నారా? అవును మీరు విన్నది నిజమే.. ఓ యువ క్రీడాకారుడు సెల్‌ఫోన్‌ను ఫుట్‌బాల్‌లా తంతూ చేతిలోకి తీసుకున్నాడు. ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతోంది. అతడి నైపుణ్యానికి నెటిజన్లంతా ఫిదాఅవుతున్నారు. 

ఈ ఫీట్‌ చేసింది జతిన్ నాయక్ అనే యువ ఫుట్‌బాల్ క్రీడాకారుడు. ఫోన్‌లో మాట్లాడుతూ నాయక్‌ ఫీల్డ్‌లోకి ప్రవేశించాడు. అక్కడ ఫుట్‌బాల్‌ కనిపించగానే ఆగిపోయాడు. బాల్‌పైసెల్‌ఫోన్‌ ఉంచి ఫోన్‌ను తంతూ గాల్లోకి ఎగరేసి చేతితో అందుకున్నాడు. అప్రయత్నంగా జరిగిన ఈ చర్య నెటిజన్లతో వావ్‌ అనిపిస్తోంది. ఈ వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్‌చేయగా చాలామంది వీక్షించారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.