Bomb Threat | గుజరాత్ రాష్ట్రంలోని వడోదరలోగల పలు పాఠశాలలకు (Vadodara Schools) వరుస బాంబు బెదిరింపులు (Bomb Threat) ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా హర్ని (Harni) ప్రాంతంలోని సిగ్నస్ స్కూల్ (Cygnus School)కు ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. శుక్రవారం ఉదయం ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు తెలిపారు.
అప్రమత్తమైన పాఠశాల యాజమాన్యం వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. రంగంలోకి దిగిన వడోదర పోలీసులు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సాయంతో పాఠశాల ప్రాంగణంలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. దాదాపు మూడు గంటల పాటూ సోదాలు చేశారు. అయితే, ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలూ, అనుమానాస్పద వస్తువులూ లభించలేదు. ఈ ఘటనతో పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కేవలం 12 రోజుల వ్యవధిలోనే బాంబు బెదిరింపులు రావడం నగరంలో ఇది మూడో ఘటన. అంతకు ముందు మరో రెండు పాఠశాలలకు ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. వరుస బాంబు బెదిరింపుల వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించేందుకు సైబర్ దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. అన్ని బెదిరింపు మెయిల్స్ ఉమర్ ఫరూఖ్ అనే పేరుతో వస్తున్నట్లు పేర్కొన్నారు.
Also Read..
Fire breaks | రైలు ఇంజిన్లో మంటలు.. తప్పిన పెను ప్రమాదం
Viral Video | కాలేజ్ వ్యాన్కోసం పరిగెడుతున్న బాలుడిని ఢీ కొన్న బస్సు.. షాకింగ్ వీడియో