Viral Video | కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కాలేజ్ బస్సు (college van) కోసం పరిగెడుతున్న 17 ఏళ్ల బాలుడిని ఆర్టీసీ బస్సు వచ్చి ఢీ కొట్టింది. ఈ ఘటనలో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి.
ఇంటర్ సెకెండ్ ఇయర్ చదువుతున్న 17 ఏళ్ల బాలుడు (Class 12 student) బుధవారం ఉదయం రోడ్డుపైకి వచ్చాడు. ఎదురుగా తను ఎక్కాల్సిన కళాశాల బస్సు వెళ్తుండటం గమనించాడు. దీంతో రోడ్డు ఇరువైపులా వాహనాలను చూసుకోకుండా పరిగెత్తాడు. ఇంతలో ఆర్డీసీ బస్సు వచ్చి బాలుడిని బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సదరు బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు స్పందించి అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. విద్యార్థి అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన షాకింగ్ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Caught on Cam | A teenager got severely injured while attempting to cross the road in haste to catch his college bus in Bengaluru. #Viral #ViralVideo #Bengaluru #Karnataka #Bus #Accident pic.twitter.com/z2PcA7XciN
— Guna Sekar (@GunaSekar689361) July 4, 2025
Also Read..
Fire breaks | రైలు ఇంజిన్లో మంటలు.. తప్పిన పెను ప్రమాదం
Bengaluru | రూ.5 లక్షల కోసం దారుణం.. అప్పుకట్టమన్నందుకు బంధువు ఇంటికి నిప్పంటించిన వ్యక్తి