Fire breaks | దేశంలో ఘోర రైలు ప్రమాదం తప్పింది. కర్ణాటకలోని మైసూర్ నుంచి బెంగళూరు మీదుగా ఉదయ్‌పూర్ వెళ్తున్న (Mysuru-Udaipur express train) హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు (Humsafar Express train) ఇంజిన్‌లో మంటలు (train engine) చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన రైల్వే సిబ్బంది సత్వర చర్యల వల్ల పెను ప్రమాదం తప్పింది.
వివరాల్లోకి వెళితే.. హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు మైసూర్ నుంచి ఉదయ్‌పూర్‌కు వెళ్తోంది. గురువారం ఉదయం 11:20 గంటల సమయంలో రైలు కర్ణాటకలోని రామనగర జిల్లాలోగల చన్నపట్న తాలూకా వద్దకు రాగానే ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి (Fire breaks out in train engine). వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది రైలును ఆపి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే చన్నపట్న నుంచి అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు.
ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదు. ఈ ఘటనతో రైలును దాదాపు 30 నిమిషాల పాటూ నిలిపివేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ప్రత్యామ్నాయ ఇంజిన్ ఏర్పాటు చేయడంతో.. తిరిగి రైలు తన ప్రయాణాన్ని కొనసాగించినట్లు అధికారులు తెలిపారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదూ అందలేదని రైల్వే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తెలిపారు. సాంకేతిక సమస్య కారణంగానే ప్రమాదం సంభవించి ఉంటుందని పేర్కొన్నారు. మరోవైపు ఇంజిన్‌లో మంటలు రావడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
#Karnataka: A fire broke out in the engine of the Palace Queen Humsafar Express near Channapatna. The visuals of the train running in full speed with flames emanating from the locomotive was captured in a CCTV.#Karnataka #TrainFire #HumsafarExpress #IndianRailways@RailMinIndia pic.twitter.com/P4urbbciXe
— Lokmat Times Nagpur (@LokmatTimes_ngp) July 4, 2025
Also Read..
Bengaluru | రూ.5 లక్షల కోసం దారుణం.. అప్పుకట్టమన్నందుకు బంధువు ఇంటికి నిప్పంటించిన వ్యక్తి
Himachal Pradesh | భారీ వర్షాలకు అతలాకుతలమైన హిమాచల్.. రూ.400 కోట్ల మేర నష్టం