Bengaluru | కర్ణాటకలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తీసుకున్న అప్పు కట్టమని అడిగినందుకు బంధువు ఇంటికి ఓ వ్యక్తి నిప్పంటించాడు (House On Fire Over Rs 5 Lakh Loan). ఈ ఘటన బెంగళూరు (Bengaluru)లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. వెంకటరమణి అనే మహిళ తన ఇద్దరు కుమారులు సతీశ్, మోహన్దాస్లతో కలిసి బెంగళూరు నగరంలోని వివేక్‌నగర్ (Viveknagar)లో నివాసం ఉంటోంది. ఏడేళ్ల కిందట బంధువైన పార్వతి తన కుమార్తె వివాహం కోసం వెంకటరమణి వద్ద రూ.5లక్షలు అప్పుగా తీసుకుంది. అయితే, ఆ అప్పు ఇప్పటి వరకూ కట్టలేదు. ఎన్నిసార్లు అడిగా.. అప్పు తీర్చలేదు. ఇటీవలే ఓ వివాహ కార్యక్రమంలో పార్వతిని అప్పు కట్టమని వెంకటరమణి మరోసారి అడిగింది. ఈ క్రమంలో అక్కడ రెండు కుటుంబాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
ఈ క్రమంలోనే జులై 1వ తేదీ సాయంత్రం 5:30 గంటల సమయంలో సుబ్రహ్మణి అనే వ్యక్తి పెట్రోల్ బాటిల్‌తో వెంకటరమణి ఇంటికి వెళ్లాడు. అక్కడ మెయిన్ డోర్, చెప్పుల స్టాండ్, కిటికీలకు పెట్రోల్‌పోసి నిప్పంటించి అక్కడినుంచి వెళ్లిపోయాడు. స్థానికులు గమనించి వెంటనే మంటలు ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ఇంటి ముందు భాగం, కిటికీలు దెబ్బతిన్నాయి. ఆ సమయంలో సతీశ్ ఇంట్లో లేడు. విషయం తెలుసుకున్న అతడు హుటాహుటిని ఇంటికి చేరుకున్నాడు. ఈ ఘటనపై వివేక్‌నగర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. సతీశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ని పరిశీలించగా.. సుబ్రహ్మణి ఇంటికి నిప్పంటిస్తున్నట్లు స్పష్టంగా కనిపించింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేపట్టారు.
#Bengaluru
A man attempted to set a house on fire over an alleged financial dispute. #CCTV footage captured the accused, Subramani, pouring petrol on the main door, window, and footwear stand of the house belonging to Venkataramani and her son Satish, before setting it ablaze. pic.twitter.com/lAVawhyrej— DINESH SHARMA (@medineshsharma) July 4, 2025
Also Read..
Himachal Pradesh | భారీ వర్షాలకు అతలాకుతలమైన హిమాచల్.. రూ.400 కోట్ల మేర నష్టం
PM Modi | మోదీ రాసిన కవితను వినిపించిన ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధాని
Air India | పరిహారం కోసం ఆర్థిక వివరాలు అడుగుతోందంటూ ఆరోపణలు.. ఖండించిన ఎయిర్ ఇండియా