Air India | పరిహారం కోసం ఆర్థిక వివరాలు అడుగుతోందంటూ ఆరోపణలు.. ఖండించిన ఎయిర్ ఇండియా
Air India | గతనెల అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా (Air India) విమానం ప్రమాదానికి (Plane Crash) గురైన విషయం తెలిసిందే.
Air India | గతనెల అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా (Air India) విమానం ప్రమాదానికి (Plane Crash) గురైన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో 272 మంది ప్రాణాలు కోల్పోయారు. వారందరికీ ఎయిర్ ఇండియా సంస్థ పరిహారం చెల్లిస్తోంది. అయితే, పరిహారం చెల్లింపు కోసం బాధితుల నుంచి (Crash victims families) సంస్థ ఆర్థిక వివరాలు అడుగుతోందంటూ ఆరోపణలు వస్తున్నాయి.
విమాన ప్రమాద ఘటనలో పరిహారం పొందాలంటే మృతుల కుటుంబాలు ఆర్థిక వివరాలు చెప్పాలంటూ ఎయిర్ ఇండియా సంస్థ బాధితులపై ఒత్తిడి తెస్తున్నట్లు బ్రిటన్‌కు చెందిన న్యాయసంస్థ స్టీవర్ట్స్ ఆరోపించింది. బాధిత కుటుంబాలకు పంపుతున్న ప్రశ్నావళిలో వ్యక్తిగత వివరాలతోపాటు ఆర్థిక సమాచారానికి సంబంధించిన ప్రశ్నలు కూడా ఉన్నట్లు తెలిపింది. మృతి చెందిన వ్యక్తిపై దరఖాస్తుదారులు ఆర్థికంగా ఆధారపడి ఉన్నారా..? లేదా..? అని సంస్థ ప్రశ్నించినట్లు పేర్కొంది. దీనిపై అప్పీల్ చేసినట్లు వెల్లడించింది. అయితే, ఈ ఆరోపణలపై ఎయిర్ ఇండియా సంస్థ తాజాగా స్పందించింది. ఆ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది.
అవన్నీ నిరాధారమైర, అవాస్తవ కథనాలని పేర్కొంది. ‘మేం పంపిన ప్రశ్నావళి కుటుంబ సంబంధాలను ధృవీకరించేందుకే. మృతులతో దరఖాస్తుదారులకు ఉన్న బంధాన్ని తెలుసుకునేందుకే. దీనివల్ల తాత్కాలిక చెల్లింపులు సరిగ్గా చేయగలం. ఇలాంటి విషయాల్లో కొన్ని అధికారిక ప్రక్రియలు అనుసరించాల్సి ఉంటుందని అర్థం చేసుకోవాలి. ఇందుకోసం బాధిత కుటుంబాలకు అవసరమైన సమయం ఇస్తున్నాం. వారికి అవసరమైన సాయం, మద్దతు ఇవ్వాలనుకుంటున్నాము’ అని ఎయిర్ ఇండియా సంస్థ వెల్లడించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.
గత నెల 12వ తేదీన మధ్యాహ్నం సమయంలో ఎయిర్ ఇండియాకు చెందిన విమానం అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయల్దేరింది. ఎయిర్‌పోర్ట్‌లో టేకాఫ్ అయిన నిమిషాల్లోనే విమానం ఓ బిల్డింగ్‌పై కుప్పకూలిపోయింది. ఆ సమయంలో విమానంలో సిబ్బంది, ప్రయాణికులు మొత్తం 242 మంది ఉన్నారు. ప్రమాదంలో 241 మంది ప్రాణాలు కోల్పోగా.. ఒకే ఒక్కరు ప్రాణాలతో మిగిలారు. ఇక విమానం మెడికల్ కాలేజీకి చెందిన హాస్టల్‌పై పడటంతో అందులోని కొందరు మెడికోలు కూడా ప్రాణాలు కోల్పోయారు. మొత్తం ఈ దుర్ఘటనలో 270 మందికిపైగా మరణించారు.
మరణించిన ప్రయాణికుల్లో 181 మంది భారతీయులు కాగా, 52 మంది బ్రిటన్ వాసులు. ప్రమాదం అనంతరం ఎయిర్ ఇండియాని నిర్వహిస్తున్న టాటా గ్రూప్ సంస్థ బాధిత కుటుంబాలకు రూ.కోటి నష్టపరిహారం ప్రకటించింది. ఆ తర్వాత మరో రూ.25 లక్షల పరిహారం ఇస్తున్నట్టు పేర్కొంది. బాధిత కుటుంబాల తక్షణ ఆర్థిక అవసరాలు తీర్చేందుకు అదనపు పరిహారం ప్రకటించినట్టు వెల్లడించింది.
Also Read..
BJP | బీజేపీ జాతీయ అధ్యక్ష పీఠంపై మహిళ.. ఆ ముగ్గురిలో ఎవరికి దక్కేనో?
సిద్ధరామయ్య ‘చెంపదెబ్బ’ అవమానం.. పోలీస్ వీఆర్ఎస్!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RC 17 | రామ్ చరణ్ – సుకుమార్ సినిమాలో హీరోయిన్గా తెలుగు అమ్మాయి.. రేసులోకి ఆ అమ్మడి పేరు!
School Van | కురవిలో స్కూల్ వ్యాన్ బోల్తా, 12 మంది విద్యార్థులకు గాయాలు.. డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమా?
Samantha | సినిమాలకు మించి వ్యాపారాల్లో సమంత జోరు.. 8 నెలల్లోనే రూ.120 కోట్ల టర్నోవర్‌తో హాట్ టాపిక్!
Suryapet | సూర్యాపేట జిల్లాలో విషాదం.. పిడుగుపాటుకు 32 ఏళ్ల గొర్రెల కాపరి మృతి!
వట్టినాగులపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 27 మంది అరెస్ట్!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

