Paetongtarn Shinawatra | థాయ్‌ల్యాండ్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆ దేశ ప్రధాని (Thailand PM) పెటంగటార్న్ షినవత్రా (Paetongtarn Shinawatra)పై వేటు పడిన విషయం తెలిసిందే. దీంతో ఆమె స్థానంలో మరో నేత తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం దేశ మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించారు (Thailand swears in new Cabinet). ఇందులో ప్రధాని పదవి పోగొట్టుకున్న పెటంగటార్న్ షివత్రాకు కూడా చోటు కల్పించారు. ఆమె కొత్త కేబినెట్లో మంత్రిగా చేరారు.
థాయ్‌ల్యాండ్ రాజు మహా వజ్రలాంగ్‌కోర్న్ ఆమోదంతో గురువారం పెటంగటార్న్ షినవత్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెకు సాంస్కృతికశాఖ బాధ్యతలను అప్పగించారు. ఇక థాయ్‌ల్యాండ్‌కు ఒక్కరోజు తాత్కాలిక ప్రధానిగా సూరియ జంగ్రుంగ్రియాంగ్కిట్ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ప్రస్తుతం హోంమంత్రిగా ఉన్న ఫామ్తామ్ వెచాయచాయ్కి తాత్కాలిక ప్రధాన మంత్రి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కొంపముంచిన ఫోన్‌కాల్..
థాయిల్యాండ్ ప్రధాని పెటంగటార్న్ షినవత్రా (Paetongtarn Shinawatra)పై వేటు వేశారు. ఆ దేశ రాజ్యాంగ కోర్టు ఇవాళ ఆ సస్పెన్షన్ విధించింది. ఓ ఫోన్ సంభాషణలో కంబోడియా మాజీ అధినేత హున్‌సేన్‌ను ‘అంకుల్’ అని సంబోధించిన పీతోంగ్టార్న్.. తమ దేశ సైనిక కమాండర్‌ను తన విరోధి అని పేర్కొనడం వివాదానికి దారితీసింది. దేశ సరిహద్దుల్లో కంబోడియాతో ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో స్వయంగా ప్రధాని తమ దేశ సైనిక కమాండర్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడంపై ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికింది.
దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. కంబోడియాతో జరిగిన దౌత్య వ్యవహారంలో ప్రధానమంత్రిగా నైతికతను ఉల్లంఘించారని చెప్పడానికి తగిన ఆధారాలున్నాయని కోర్టు పేర్కొన్నది. ప్రధానమంత్రి పదవి నుంచి తప్పిస్తూ రాజ్యాంగ కోర్టు 7-2 తేడాతో తీర్పును వెలువరించింది. కంబోడియాతో బోర్డర్ చర్చలు నిర్వహిస్తున్న వేళ.. షినవత్రా తన విలువలు మరిచినట్లు కన్జర్వేటివ్ సేనేటర్లు ఆరోపించారు. రాజ్యాంగ తీర్పును సవాల్ చేస్తూ మరో 15 రోజుల్లోగా ప్రధాని షినవత్రా తన వాదనలను వినిపించుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఆమె కేసును డిస్మిస్ చేస్తారు. ఒకవేళ పెటంగటార్న్ షినవత్రాను డిస్మిస్ చేస్తే, ప్రధాని బాధ్యతల నుంచి సస్పెండ్ అయిన రెండో వ్యక్తిగా ఆమె నిలుస్తారు.
Also Read..
“Thailand PM | షినవత్రాపై వేటు.. ఒక్క రోజు ప్రధానిగా సురియా జున్‌గ్రున్‌గ్రుంగిట్ బాధ్యతలు”
“Paetongtarn Shinawatra: థాయిల్యాండ్ ప్రధాని షినవత్రాపై వేటు”
“Thailand | థాయ్‌లాండ్ నూతన ప్రధానిగా పేటోంగ్టార్న్ ఎన్నిక.. రెండో మహిళా ప్రధానిగా రికార్డు”