Thailand PM | థాయ్‌ల్యాండ్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆ దేశ ప్రధాని (Thailand PM) పెటంగటార్న్ షినవత్రా (Paetongtarn Shinawatra)పై వేటు పడిన విషయం తెలిసిందే. దీంతో ఆమె స్థానంలో మరో నేత తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అయితే కేవలం ఒక్కరోజు మాత్రమే ఆయన ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. డిప్యూటీ పీఎం సురియా జున్‌గ్రున్‌గ్రుంగిట్ (Suriya Jungrungreangkit) బుధవారం ఒక్క రోజుకు తాత్కాలిక ప్రధానిగా వ్యవహరించనున్నారు. బుధవారం ఉదయం బ్యాంకాక్‌లోని ప్రధాని కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.
షినవత్రాపై వేటు
థాయిల్యాండ్ ప్రధాని పెటంగటార్న్ షినవత్రా (Paetongtarn Shinawatra)పై వేటు వేశారు. ఆ దేశ రాజ్యాంగ కోర్టు ఇవాళ ఆ సస్పెన్షన్ విధించింది. పొరుగు దేశం కంబోడియాతో జరిగిన ఫోన్ సంభాషణ కేసులో విచారణ చేపట్టిన కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. ప్రధానమంత్రి పదవి నుంచి తప్పిస్తూ రాజ్యాంగ కోర్టు 7-2 తేడాతో తీర్పును వెలువరించింది. కంబోడియాతో బోర్డర్ చర్చలు నిర్వహిస్తున్న వేళ.. షినవత్రా తన విలువలు మరిచినట్లు కన్జర్వేటివ్ సేనేటర్లు ఆరోపించారు. రాజ్యాంగ తీర్పును సవాల్ చేస్తూ మరో 15 రోజుల్లోగా ప్రధాని షినవత్రా తన వాదనలను వినిపించుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఆమె కేసును డిస్మిస్ చేస్తారు. ఒకవేళ పెటంగటార్న్ షినవత్రాను డిస్మిస్ చేస్తే, ప్రధాని బాధ్యతల నుంచి సస్పెండ్ అయిన రెండో వ్యక్తిగా ఆమె నిలుస్తారు.
Also Read..
Paetongtarn Shinawatra: థాయిల్యాండ్ ప్రధాని షినవత్రాపై వేటు
“Thailand | థాయ్‌లాండ్ నూతన ప్రధానిగా పేటోంగ్టార్న్ ఎన్నిక.. రెండో మహిళా ప్రధానిగా రికార్డు”