Himachal Pradesh | హిల్స్టేట్ హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)ను భారీ వర్షాలు (Heavy Rains) అతలాకుతలం చేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఆకస్మిక వరదలు సంభవించాయి. అనేకచోట్ల రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. వంతెనలు కొట్టుకుపోయాయి. విద్యుత్, నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఇక ఈ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో ముందు జాగ్రత్తగా రహదారులను అధికారులు మూసివేశారు (Roads Shut). వారం రోజులుగా కురుస్తున్న ఈ వర్షాలకు భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది.
ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి 63 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 40 మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం సహాయక బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 100 మందికిపైగా గాయపడ్డారు. వందలాది ఇళ్ళు ధ్వంసమయ్యాయి. 14 వంతెనలు కొట్టుకుపోయాయి. సుమారు 500కిపైగా రోడ్లను అధికారులు మూసివేశారు. వర్షాల కారణంగా దాదాపు 500కిపైగా విద్యుత్ పంపిణీ ట్రాన్స్ఫార్మర్లు పనిచేయడం లేదు. దీంతో పదివేల మంది ప్రజలు అంధకారంలోనే మగ్గుతున్నారు. నీటి సరఫరాకు కూడా అంతరాయం ఏర్పడింది. ఈ వర్షాలకు రూ.400 కోట్లకుపైగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం అంచనా వేసింది. అయితే, అంతకంటే ఎక్కువే నష్టం ఉంటుందని రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ, రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి డీసీ రాణా తెలిపారు.
Whoahh, that was close!!
A massive landslide hit the Shillai area of Sirmaur district, Himachal Pradesh, India today, along National Highway 707 👀pic.twitter.com/nVvfZWty90
— Volcaholic 🌋 (@volcaholic1) May 30, 2025
మరోవైపు రాష్ట్రంలోని పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరికలు జారీ చేసింది. జులై 5న సిమ్లా, సోలన్, సిర్మౌర్, జులై 6న ఉనా, బిలాస్పూర్, హమీర్పూర్, కాంగ్రా, చంబా, మండి జిల్లాలకు వర్ష సూచన చేసింది. ఈ మేరకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగతా ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ఏకాంత ప్రదేశాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఇప్పటికే వర్షప్రభావం ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఐఎండీ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, నదులు, వాగులు, కొండ ప్రదేశాలకు వెళ్లొద్దని సూచించారు.
शिमला : ढली के लिंडीधार में भारी लैंडस्लाइड – फोरलेन का डंगा गिरा – सैंकड़ों सेब के पेड़ दबे।
घर छोड़ भागे लोग, 5 घरों को खतरा।#Shimla #Dhali #Landslide #HimachalNews #DDNewsHimachal pic.twitter.com/dKaekscobU
— DD News Himachal (@DDNewsHimachal) July 3, 2025
Also Read..
PM Modi | మోదీ రాసిన కవితను వినిపించిన ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధాని
Air India | పరిహారం కోసం ఆర్థిక వివరాలు అడుగుతోందంటూ ఆరోపణలు.. ఖండించిన ఎయిర్ ఇండియా
Indian Origin Man: విమానంలో గొడవపడ్డ భారత సంతతి వ్యక్తి.. అమెరికాలో అరెస్టు