Indian Origin Man: విమానంలో గొడవపడ్డ భారత సంతతి వ్యక్తి.. అమెరికాలో అరెస్టు
Indian Origin Man: అమెరికాలో భారతీయ సంతతి వ్యక్తిని అరెస్టు చేశారు. ఫిలడెల్ఫియా నుంచి మియామికి విమానంలో వెళ్తున్న ఆ వ్యక్తి తోటి ప్రయాణికుడిపై చేయి చేసుకున్నాడు. ఈ ఘటనకు చెందిన వీడియో ఒకటి వైరల్ అవుతున్నది.
ఫిలడెల్ఫియా: అమెరికాలో భారతీయ సంతతి వ్యక్తి(Indian Origin Man)ని అరెస్టు చేశారు. ఫిలడెల్ఫియా నుంచి మియామికి విమానంలో వెళ్తున్న ఆ వ్యక్తి తోటి ప్రయాణికుడిపై చేయి చేసుకున్నాడు. ఈ ఘటనకు చెందిన వీడియో ఒకటి వైరల్ అవుతున్నది. నివార్క్ నివాసితుడు, 21 ఏళ్ల ఇషాన్ శర్మ.. కీన్ ఇవాన్స్ మధ్య గొడవ జరిగింది. జూన్ 30వ తేదీన ఫ్రంటర్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఈ ఘటన జరిగింది. ఒకర్ని ఒకరు గొంతు పట్టుకుని కొట్టుకున్నారు. తోటి ప్రయాణికులు వద్దని వేడుకుంటున్నా.. ఆ ఇద్దరూ ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డారు.
దాడి గురించి పోలీసులకు ఇవాన్స్ ఫిర్యాదు చేశాడు. తనను చూసి ఇషాన్ నవ్వాడని, చంపేస్తానని బెదిరించాడని, తనను సవాల్ చేస్తే, చావు తప్పదని హెచ్చరించాడని అతను పోలీసులకు చెప్పాడు. వాష్‌రూమ్‌కు వెళ్లిన సమయంలో.. శర్మ గురించి ఫ్లయిట్ అటెండెంట్స్‌కు చెప్పినట్లు వెల్లడించాడు. అయితే పదేపదే శర్మ బెదిరించడంతో.. అసిస్టెన్స్ బటన్ నొక్కినట్లు అతను చెప్పాడు. ఆ తర్వాత పరిస్థితి మరింత జఠిలంగా మారిందన్నాడు.
విమానం ల్యాండ్ అయిన తర్వాత శర్మను అదుపులోకి తీసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేశారు. కోర్టులో శర్మ తరపున లాయర్ వాదించారు. శర్మ తన సీటులో ధ్యానం చేస్తుంటే పక్క సీటులో ఉన్న వ్యక్తికి అది నచ్చలేదని, దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ తలెత్తినట్లు చెప్పారు.
New: Ishaan Sharma, 21, was arrested for allegedly committing an unprovoked assault on a fellow passenger aboard a Frontier flight to Miami.
Sharma faces charges of battery and a $500 bond, per jail records.
The victim reported to police that the attack was unprovoked,… pic.twitter.com/9xwPmKNHaF
— The Facts Dude (@The_Facts_Dude) July 3, 2025
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

