డబ్ల్యూటీవో ఒప్పందం నుంచి వైదొలగాలి
ఎంఎస్పీకి చట్టబద్ధతో సహా పలు న్యాయమైన డిమాండ్ల సాధన కోసం పోరాటం కొనసాగిస్తు న్న రైతులు.. కేంద్రం ముందుకు మరో డిమాం డ్ తీసుకొచ్చారు. పంట ధరల గ్యారెంటీలపై ప రిమితులు విధించడం ద్వారా రైతుల సంక్షే మం, పురోగతికి అడ్డుగా ఉన్న ప్రపంచ వాణి జ్య సంస్థ (డబ్ల్యూటీవో) ఒప్పందం నుంచి భా రత్ బయటకు రావాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
- వ్యవసాయాన్ని బయటకు తేవాలి
- కేంద్రానికి రైతు సంఘాల డిమాండ్
- పలు రాష్ర్టాల్లో ట్రాక్టర్ ర్యాలీలు
న్యూఢిల్లీ/చండీగఢ్/లక్నో, ఫిబ్రవరి 26: ఎంఎస్పీకి చట్టబద్ధతో సహాపలు న్యాయమైన డిమాండ్ల సాధన కోసం పోరాటం కొనసాగిస్తు న్న రైతులు.. కేంద్రం ముందుకు మరో డిమాండ్ తీసుకొచ్చారు. పంట ధరల గ్యారెంటీలపై ప రిమితులు విధించడం ద్వారా రైతుల సంక్షేమం, పురోగతికి అడ్డుగా ఉన్న ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) ఒప్పందం నుంచి భారత్ బయటకు రావాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
డబ్ల్యూటీవో పరిధి నుంచి వ్యవసాయ రంగాన్ని బయటకు తీసుకొచ్చేందుకు ఇతర ప్రపంచ దేశాలపై ఒత్తిడి చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) ఆధ్వర్యంలో రైతులు దేశవ్యాప్తం గా ‘క్విట్ డబ్ల్యూటీవో డే’ ఆందోళన పేరుతో పలు రాష్ర్టాల్లో ట్రాక్టర్ల ర్యాలీ చేపట్టారు. ఈ నెల 26 నుంచి 29 వరకు అబుదాబిలో డ బ్ల్యూటీవో 13వ మంత్రుల సదస్సు జరుగనున్నది. అన్ని దేశాలకు చెందిన మంత్రులు హాజరుకానున్న ఈ సమావేశంలో బహుముఖ ఆర్థి క వ్యవస్థను సమీక్షించడంతోపాటు సంస్థ అ జెండాపై నిర్ణయం తీసుకోనున్నారు.
హైవేలపై ట్రాకర్లు పార్క్ చేసి నిరసన
ఎస్కేఎం పిలుపుతో దేశవ్యాప్త ఆందోళన లో భాగంగా పంజాబ్, హర్యానాల్లోని జాతీ య రహదారులపై రైతులు తమ ట్రాక్టర్లను పార్క్ చేసి ఆందోళనలు చేశారు. దోబా కిసాన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు జంగ్వీర్ సింగ్ చౌహా న్ మాట్లాడుతూ డబ్ల్యూటీవో పాలసీలు రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయని విమర్శించారు. ఏఐకేఎస్ నేత శంశేర్ సింగ్ మాట్లాడుతూ డ బ్ల్యూటీవో పాలసీల కారణంగానే రైతులు పం డించిన పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వడం లేదని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్‌లో రైతుల ఆందోళనతో ఢిల్లీ-యూపీ సరిహద్దుల్లో ట్రాఫిక్‌పై ప్రభావం పడింది.
కేంద్రానికి వ్యతిరేకంగా సీపీఐ ఆందోళన
హైదరాబాద్ (నమస్తే తెలంగాణ): పంట కు కనీస మద్దతు ధర ఇవ్వాలని కోరుతూ ఢిల్లీ సరిహద్దుల్లో శాంతియుతంగా ఆందోళన చేస్తు న్న రైతులపై మోదీ ప్రభుత్వం క్రూరమైన అణచివేతకు పాల్పడుతున్నదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. రైతుల పై కేంద్ర ప్రభుత్వ దమనకాండను నిరసిస్తూ సోమవారం ట్యాంక్‌బండ్ వద్దనున్న అంబేద్క ర్ విగ్రహం వద్ద భారీ ప్రదర్శన నిర్వహించా రు. చాడ వెంకట్‌రెడ్డి, పశ్యపద్మ పాల్గొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్‌కు దీప్కే కౌంటర్
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్‌నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

