కాన్పూర్: బీటెక్ సైబర్ సెక్యూరిటీ కోర్సులో ప్రవేశం లభించకపోవడంతో ఐఐటీ కాన్పూర్ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసిన విద్యార్థి ఉదంతంలో వినూత్న పరిణామం చోటుచేసుకుంది. తన ప్రతిభను నిరూపించుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ విద్యార్థి చేసిన ఈ సాహసానికి యాజమాన్యం అతనిపై కేసు నమోదు చేయించడానికి బదులు, ఇంటర్న్‌షిప్ ఆఫర్ చేసింది.
ఈ ఘటనపై ఐఐటీ కాన్పూర్ డైరెక్టర్ మనీంద్ర అగర్వాల్ స్పందిస్తూ, ఆ విద్యార్థిపై తొలుత సైబర్ క్రైమ్ కేసు నమోదు చేయాలని భావించినప్పటికీ, అతని భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని, సంస్థలోని సీ3ఐ హబ్‌లో ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం కల్పిస్తున్నామన్నారు. అతను వచ్చే ఏడాది ప్రవేశం కోసం ప్రయత్నించవచ్చన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడటం సరైనది కాదని ఆయన సూచించారు.