Most Scenic Rail Journeys | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: దేశంలో అత్యంత అందమైన రైలు ప్రయాణాల్లో కొన్నింటి జాబితాను రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ‘ఎక్స్’లో పంచుకున్నారు. ఆరు ప్రయాణాలను ఈ జాబితాలో పేర్కొన్న ఆయన.. మొదటి స్థానంలో గుజరాత్‌లోని కచ్‌లో తెల్లటి ఇసుక ఎడారి మీదుగా సాగే రైలు ప్రయాణానికి చోటు కల్పించారు.
తర్వాత యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన నీలగిరి మౌంటైన్ రైల్వే, జమ్ము కశ్మీర్లో బనిహాల్ నుంచి బద్గాం వరకు జరిగే ప్రయాణం, గోవా దూద్‌సాగర్ జలపాతం మీదుగా వెళ్లే రైలు, కేరళలోని కప్పిల్లో కొబ్బరి తోటల నుంచి సాగే రైలు ప్రయాణం, హిమాచల్‌ప్రదేశ్‌లో కల్క నుంచి సిమ్లా వరకు ఉన్న టాయ్ ట్రెయిన్ గురించి ఆయన పోస్ట్ చేశారు.
🚄Some of the most scenic Rail Journeys across India…
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) September 22, 2024
1. 🚄Kutch, Gujarat – Immerse in the vibrant hues of the desert & white sands of the Rann with Namo Bharat Rapid Rail. pic.twitter.com/ERuPiG1dsL
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) September 22, 2024