న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 10 రాష్ర్టాలు సీబీఐకి ‘జనరల్ కన్సెంట్(సాధారణ సమ్మతి)’ని ఉపసంహరించుకున్నాయని కేంద్రం వెల్లడించింది. ఈ రాష్ర్టాల జాబితాలో తమిళనాడు, తెలంగాణ, పంజాబ్, జార్ఖండ్, కేరళ, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, మిజోరం, మేఘాలయా ఉన్నాయని బుధవారం లోక్సభలో కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ రాతపూర్వక సమాధానం ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఖాళీలను వేగవంతంగా, మిషన్ మోడ్లో భర్తీ చేస్తున్నామని కేంద్రం ప్రకటించింది. ఉద్యోగాల భర్తీ నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నది.