 
                                                            న్యూఢిల్లీ: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)ను బ్యాన్ చేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే(Mallikarjun Kharge) పిలుపునిచ్చారు. దేశంలో నెలకొన్న శాంతి, భద్రతలకు బీజేపీ, ఆర్ఎస్ఎస్దే బాధ్యత అని ఆయన విమర్శించారు. ఒకవేళ సర్దార్ వల్లభాయ్ పటేల్ అభిప్రాయాలను ప్రధాని మోదీ నిజంగా గౌరవిస్తే, అప్పుడు ఆర్ఎస్ఎస్ను బ్యాన్ చేయాలని ఖర్గే అభిప్రాయపడ్డారు. ఇవన్నీ తన వ్యక్తిగత అభిప్రాయాలు అని పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ను బ్యాన్ చేయాలని ఓపెన్‌గా చెబుతున్నట్లు తెలిపారు. ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాన్ని తెలిపారు.
ఇందిరా గాంధీతో పాటు సర్దార్ పటేల్ కూడా దేశ ఐక్యత కోసం శ్రమించినట్లు ఖర్గే తెలిపారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి సర్ధార్ పటేల్ రాసిన లేఖను ఆయన గుర్తు చేశారు. గాంధీ మృతి తర్వాత ఆర్ఎస్ఎస్ సంబరాలు చేసుకుందని, ఈ నేపథ్యంలో ఆ సంస్థను నిషేధించాలని ఆ లేఖలో కోరారు. గాంధీ హత్య తర్వాత ఆర్ఎస్ఎస్ స్వీట్లు పంపిణీ చేసినట్లు ఖర్గే తెలిపారు. సంఘ్ సభ్యుల ప్రసంగాల్లో విషం ఉన్నట్లు పేర్కొన్నారు. సర్దార్ పటేల్ ఇదే తరహా లేఖను గోల్‌వాకర్‌కు కూడా రాసినట్లు ఖర్గే వెల్లడించారు.
सरदार पटेल कहते थे कि संघ के भाषण सांप्रदायिकता के ज़हर से भरे हैं। संघ के कारण ही गाँधी जी की हत्या हुई थी।
जिन लोगों ने गाँधी जी की हत्या की थी, आज वही लोग कांग्रेस से सवाल पूछते हैं।
सरदार वल्लभभाई पटेल देश को एक करने वाले नेता हैं। उन्होंने संविधान सभा में Fundamental… pic.twitter.com/23u9DJnNpx
— Mallikarjun Kharge (@kharge) October 31, 2025
 
                            