ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 19, 2020 , 12:52:34

తోపుడు బండిపై భర్త శవాన్ని అంత్యక్రియలకు తరలించిన మహిళ.. వీడియో

తోపుడు బండిపై భర్త శవాన్ని అంత్యక్రియలకు తరలించిన మహిళ.. వీడియో

బెల్గాం : కర్ణాటక రాష్ర్టంలోని బెల్గాంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. భర్త మృతిచెందగా ఏ ఒక్కరు సహాయం చేయకపోవడంతో చేసేది లేక మృతదేహాన్ని తోపుడు బండిపై ఉంచి కర్మకాండల కోసం శ్మశాన వాటికకు తరలించిందో మహిళ. ఆసమయంలో కరోనా భయంతో ఆమెకు ఏ ఒక్కరూ సాయం చేయలేదు. 

తన ఇద్దరు కుమారులతో కలిసి భర్త మృతదేహాన్ని బండిపై తీసుకెళ్లి అంత్యక్రియలు చేసినట్లు ఆమె తెలిపింది. కనీసం కుటుంబ సభ్యులు, బంధువులు కూడా సాయం చేయలేదని ఆమె పేర్కొంది. తన భర్త కరోనాతో చనిపోయాడని భావించి ఏ ఒక్కరు మృతదేహం వద్దకు రాలేదని ఆమె పేర్కొంది. తన వద్ద డబ్బు కూడా లేకపోవడంతో చేసేది లేక తోపుడు బండిపై తీసుకెళ్లి అంత్యక్రియలు చేశామని చెప్పుకొచ్చింది. ఈ ఘటనను నాగరాజు అనే వ్యక్తి వీడియో తీసి ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. 

బెల్గాంకు చెందిన సదాశివ్‌ హిరట్టి (55) బుధవారం రాత్రి ఇంట్లో మరణించాడు. ఈ సమయంలో అతడి భార్య, కొడుకు, కుమార్తె ఇంట్లో లేరు. మృతుడి భార్య కొడుకు, కుమార్తె ఇంటికి వచ్చి తలుపు కొట్టగా సదాశివ్ నుంచి ఎలాంటి సమాధానం లేకుండడంతో తలుపులు పగులగొట్టి చూడగా సదాశివ్ కుర్చీపై చనిపోయి ఉన్నట్లు గుర్తించారు. గుండెపోటుతో సదాశి‌వ్‌ మరణించవచ్చని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. తన భర్తకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని ఎవరికి చెప్పినా వినలేదని, చేసేది లేక తానే తన భర్త మృతదేహాన్ని ఒక గుడ్డలో చుట్టి తోపుడు బండిపై పెట్టి కుమారుల సాయంతో శ్మశాన వాటికకు తరలించి అంత్యక్రియలు చేసినట్లు ఆమె పేర్కొంది. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo