కోల్కతా: పశ్చిమబెంగాల్ ఆది నుంచి ఏదో ఒక పార్టీకి ఏండ్లపాటు కంచుకోటగా ఉంటూ వస్తున్నది. గత 15 ఏండ్లుగా అధికారంలో ఉన్న టీఎంసీకి ఈసారి బీజేపీ అడ్డుకట్ట వేసింది. 1950 నుంచి 1967 వర కు 17 ఏండ్ల పాటు కాంగ్రెస్ అధికారంలో ఉంది. అనంతరం రెండుసార్లు బంగ్లా కాంగ్రెస్, రెండుసార్లు కాంగ్రెస్ విజయం సాధించగా నాలుగుసార్లు రాష్ట్రపతి పాలన విధించారు.
అయితే 1977లో తొలిసారి అధికారం చేపట్టిన కమ్యూనిస్టు పార్టీ 2011 వరకు 34 ఏండ్లపాటు తన విజయపరంపర కొనసాగించింది. 2011లో టీఎంసీ నేత మమతా బెనర్జీ కమ్యూనిస్టుల కంచుకోటలో పాగా వేశారు. అప్పటి నుంచి 15 ఏండ్లపాటు తన పట్టును నిలుపుకొన్నారు. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి మమత కంచుకోటను బద్దలు కొట్టింది.