ప్లాస్టిక్ డబుల్ ఎటాక్.. భూమి మీద ఉన్న జంతువుల బరువు కంటే డబుల్
మట్టిలో కలిసిపోదు. నీటిలో కరిగిపోదు. గాలిలో ఏకమవ్వదు. పోనీ అలాగే ఉంచుదామంటే ప్రాణులకు పెనుముప్పుగా మారుతుంది. ‘ప్లాస్టిక్' మహమ్మారి గురించే ఈ ఉపోద్ఘాతమంతా. మనుషులు, జంతువుల ఆరోగ్యంతో పాటు దేశ ఆర్థికాలను ఛిన్నాభిన్నం చేస్తున్న ప్లాస్టిక్‌ను కట్టడి చేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి.
- ఆరోగ్యంతో పాటు దేశాల ఆర్థికానికి కూడా గొడ్డలిపెట్టే
హైదరాబాద్, ఫిబ్రవరి 5 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): మట్టిలో కలిసిపోదు. నీటిలో కరిగిపోదు. గాలిలో ఏకమవ్వదు. పోనీ అలాగే ఉంచుదామంటే ప్రాణులకు పెనుముప్పుగా మారుతుంది. ‘ప్లాస్టిక్’ మహమ్మారి గురించే ఈ ఉపోద్ఘాతమంతా. మనుషులు, జంతువుల ఆరోగ్యంతో పాటు దేశ ఆర్థికాలను ఛిన్నాభిన్నం చేస్తున్న ప్లాస్టిక్‌ను కట్టడి చేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. దీంతో భూగోళమంతా ప్లాస్టిక్‌మయంగా మారిపోతున్నది. ప్రస్తుతం భూమి మీద ఉన్న మొత్తం జంతువుల బరువు కంటే ప్లాస్టిక్ బరువు రెట్టింపు కంటే ఎక్కువగా ఉన్నట్టు తేలడం ఆందోళన కలిగిస్తున్నది.
ప్లాస్టిక్ గురించి తెలుసా?
- ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు విడుదలైన ప్లాస్టిక్ వ్యర్థాల బరువు 1000 కోట్ల టన్నులు
- భూమి మీద ఉన్న మొత్తం జంతువుల బరువు 400-500 కోట్ల టన్నులు
- ప్రపంచంలోని 20 దేశాల నుంచి వస్తు న్న మొత్తం ప్లాస్టిక్ వ్యర్థాలు 69%
- విడుదలైన మొత్తం ప్లాస్టిక్‌లో రీసైక్లింగ్ అవుతున్న ప్లాస్టిక్-9%
- ఒక్క ప్లాస్టిక్ బాటిల్ పర్యావరణంలో కలిసిపోవడానికి పట్టే సమయం-450 సంవత్సరాలు
- ప్లాస్టిక్ వల్ల సంభవిస్తున్న అనారోగ్యం, మరణాలకు ప్రపంచం ఏటా ఖర్చు చేస్తు న్న మొత్తం-1.5 లక్షల కోట్ల డాలర్లు
మైక్రోప్లాస్టిక్ ఎక్కడివరకూ చొచ్చుకుపోయిందంటే?
సముద్రపు ఉప్పు, చక్కెర, తేనె, బియ్యం, చేపలు, పండ్లు, కూరగాయలు, పప్పులు, టీబ్యాగ్స్, ప్రాసెస్డ్ ప్రొటీన్స్, బాటిల్ వాటర్, బీర్, బాటిల్ సాఫ్ట్ డ్రింక్స్
మన శరీరంలో మైక్రోప్లాస్టిక్ ఇలా..
రక్తం, తల్లిపాలు, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, గుండె, జీర్ణాశయం, కాలేయం, శుక్రకణాలు, ప్లీహం, గర్భస్థమావి, ఎముకలు, మృదులాస్థి, మూత్రము, చెమట, వెంట్రుకలు, చర్మం, శ్వాసకోశనాళాలు
మైక్రోప్లాస్టిక్‌తో వచ్చే వ్యాధులు
కణాలు, కణజాలాలు ధ్వంసమవ్వడం, శ్వాసకోశ వ్యాధులు, ఊపిరితిత్తులపై ప్రభావం, జీర్ణాశయ సమస్యలు, దీర్ఘకాల వ్యాధులు, సంతాన సమస్యలు

Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

