తమిళనాడు : తమినాడులో(Tamil Nadu) రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ ఆ రాష్ట్రానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. రాజకీయ అనిశ్చి నేపథ్యంలో అల్లర్లు జరిగే అవకాశం ఉందని హెచ్చరింది. ముఖ్య ప్రాంతాల్లో భద్రతను పెంచాలని కేంద్ర హోం శాఖ సూచించింది. కాగా, తమిళనాడు రాజకీయాలు అనూహ్య మలుపు తిరిగాయి.
ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైన టీవీకే అధినేత (TVK Chief) విజయ్ (Vijay) కి గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ షాకిచ్చారు. లోక్‌భవన్ (Lok Bhavan) లో గవర్నర్‌ను కలిసిన విజయ్‌కి ఆయన సంఖ్యాబలం విషయంలో స్పష్టమైన నిబంధనలను గుర్తుచేశారు. తగినంత మెజారిటీ లేనిదే ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వలేమని స్పష్టంచేశారు. దాంతో తమిళనాడులో రాజకీయ సస్పెన్స్ మరింత ముదిరింది.
తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన మ్యాజిక్ ఫిగర్ 118. అయితే ప్రస్తుత సమీకరణాల ప్రకారం టీవీకే బలం 107 సీట్లు. విజయ్ రెండుచోట్ల గెలవడంతో ఒక సీటుకు రాజీనామా చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం టీవీకే బలం 107 మాత్రమే. మద్దతు ఇస్తున్న కాంగ్రెస్ బలం 5 సీట్లు. దాంతో మొత్తం బలం 112 అవుతుంది. ఈ క్రమంలో విజయ్ పార్టీకి మరో 6 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఈ క్రమంలోనే మెజారిటీ లేనందున ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.