న్యూఢిల్లీ: జమ్ముకశ్మీరులోని పహల్గాంలో మంగళవారం జరిగిన ఉగ్రవాద దాడిని సుప్రీంకోర్టు తీవ్రంగా ఖండించింది. మృతులకు న్యాయమూర్తులు, న్యాయవాదులు, సిబ్బంది, తదితరులు నివాళులర్పించారు. సంతాప సూచికగా 2నిమిషాల పాటు మౌనం పాటించారు.
ఫుల్ కోర్టు మీటింగ్లో ఈదాడిని ఖండిస్తూ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించినట్లు సుప్రీంకోర్టు తెలిపింది. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్, సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ కూడా దాడిని తీవ్రంగా ఖండించి, బాధితులకు సంఘీభావం తెలిపాయి.