న్యూఢిల్లీ: జాతీయ పార్కులు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, పులుల సంరక్షణ కేంద్రాల పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని సుప్రీంకోర్టు అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసింది.
గుజ్జార్, పకార్ బ్లాక్, సొనాడి రేంజ్లలో జూలు, సఫారీల ఏర్పాటు పేరుతో పలు చెట్లను నరికేస్తున్నారని, విచ్చలవిడిగా భవనాలు నిర్మిస్తున్నారని, దీని వల్ల పర్యావరణానికి హాని కలగడమే కాక, అక్కడ ఉన్న వన్యప్రాణుల ఉనికికే ప్రమాదంగా మారుతున్నదన్న న్యాయవాది గౌరవ్ కుమార్, తదితరుల పిటిషన్లపై సుప్రీం కోర్టు బుధవారం విచారణ చేసింది.