న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: జాతీయ భద్రతావసరాల కోసం దేశం స్పైవేర్‌ను పొందడంలో తప్పేమీ లేదని సుప్రీంకోర్టు మంగళవారం స్పష్టం చేసింది. అయితే ఎవరిపైన ఈ స్పైవేర్‌ను వాడుతున్నారన్నదే ముఖ్యమైన అంశమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ప్రైవేట్ వ్యక్తులపై దీన్ని ప్రయోగిస్తున్నారన్న ఆరోపణలను పరిశీలిస్తామని దేశ అత్యున్నత న్యాయస్థానం హామీ ఇచ్చింది.
ఇజ్రాయెల్‌కు చెందిన స్పైవేర్ పెగాసస్‌ని ఉపయోగించి పలువురు ప్రముఖులపై ప్రభుత్వం నిఘా పెట్టిందన్న ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ దాఖలైన పలు పిటిషన్లపై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కోటీశ్వర్ సింగ్‌తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. రాజ్యాంగం ప్రకా రం ప్రైవసీ హక్కు కలిగి ఉన్న పౌరుడిని కాపాడతామని జస్టిస్ సూర్యకాంత్ హామీ ఇచ్చారు.