న్యూఢిల్లీ, అక్టోబర్ 25: దేశవ్యాప్తంగా ఓటర్ జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)కు రంగం సిద్ధమైంది. ‘సర్’ మొదటి దశను వచ్చే వారం నుంచి దేశంలోని 10 నుంచి 15 రాష్ర్టాల్లో కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) నిర్వహించబోతున్నది. 2026లో ఎన్నికలు జరగబోతున్న అస్సాం, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ర్టాల్లో ముందుగా ‘ఓటర్ల లిస్ట్ ప్రక్షాళన’ ఉంటుందని కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారి ఒకరు శనివారం మీడియాకు వెల్లడించారు.
అయితే, స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న లేదా జరగనున్న రాష్ర్టాల్లో తదుపరి దశ సర్ ద్వారా ఓటర్ల లిస్ట్‌ల ప్రక్షాళన చేపడతామని తెలిపారు.