న్యూఢిల్లీ : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) మొదలై ఈ నెల 24 నాటికి సంవత్సరం పూర్తయింది. బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్నికల సంఘం దీన్ని ప్రారంభించింది. బీహార్‌లో 65 లక్షల ఓటర్లను తొలగించారు. ఇప్పటి వరకు 19 రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో దీన్ని నిర్వహించి దాదాపు 6 కోట్లకు పైగా ఓట్లను ఈసీ అధికారులు తొలగించారు. ‘సర్’లో తొలగించిన ఓటర్లకు సంక్షేమ పథకాలను కూడా బీజేపీ పాలిత ప్రభుత్వాలు ఆపేస్తున్నాయి. ప్రస్తుతం ‘సర్’ మూడో విడత పలు రాష్ర్టాల్లో నిర్వహిస్తున్నట్టు అధి కారులు తెలిపారు.
దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసిన సర్‌ను ఇప్పుడు ఎన్సీఈఆర్టీ కొత్తగా రూపొందించిన తొమ్మిదో తరగతి సాంఘిక శాస్త్రం పాఠ్యాంశంగా గుర్తించారు. అనర్హులను ఓటర్ల జాబితాలో చేరకుండా, అలాగే అర్హులను తొలగించకుండా చూసే విధంగా ఈ పాఠ్యాంశంను చేర్చినట్టు అధికారులు తెలిపారు.