న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విస్తృతి అంతకంతకే పెరిగిపోతున్నది. దేశమంతటా లక్షల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. గత వారం రోజుల నుంచి ఏ రోజు కూడా కొత్త కేసుల సంఖ్య మూడు లక్షలకు తగ్గలేదు. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు గడిచిన 24 గంటల్లో కూడా దేశవ్యాప్తంగా 3,52,991 కొత్త కేసులు, 2,812 కరోనా మరణాలు చోటుచేసుకున్నాయి.
దాంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 1.73 కోట్లు దాటింది. మరణాల సంఖ్య 1,95,213కు చేరింది. మరో 28,14,658 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మహారాష్ట్రలో పరిస్థితి దారుణంగా ఉన్నా సోమవారం నమోదైన కొత్త కేసుల సంఖ్య భారీగా తగ్గింది. ఢిల్లీలో సైతం కొత్త కేసుల సంఖ్య తగ్గినా 380 మంది కరోనా బాధితులు మరణించారు.
ఈ పరిస్థితుల్లో భారత్ సాయమందించేందుకు పలు ప్రపంచదేశాలు ముందుకు వస్తున్నాయి. సోమవారం దేశంలో కరోనా పరిస్థితిపై మాట్లాడిన ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ గెబ్రెయేసస్.. ఇది గుండెలను పగులగొట్టే విషాదం కంటే దారుణమైనదని పేర్కొన్నారు. భారత్కు కీలక సామాగ్రిని సమకూర్చనున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా అమెరికా, యూకే, ఫ్రాన్స్, అస్ట్రేలియా, జర్మనీ దేశాలు కూడా తమవంతు సాయం అందించేందుకు ముందుకొచ్చాయి.
అందులో భాగంగానే ఈ ఉదయం యునైటెడ్ కింగ్డమ్ నుంచి ప్రాణాలు వైద్య సామాగ్రి భారత్కు చేరింది. ఈ తెల్లవారుజామునే ఢిల్లీ విమానాశ్రయానికి చేరిన ఈ వైద్య సామాగ్రిలో 100 వెంటిలేటర్లు, 95 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఉన్నాయి. భారత విదేశీ వ్యవహారాల శాఖ ఉదయం ఈ విషయాన్ని వెల్లడించింది.
The shipment of vital medical supplies from the United Kingdom, including 100 ventilators & 95 oxygen concentrators, arrived in India earlier this morning: Ministry of External Affairs (MEA)#COVID19 pic.twitter.com/Ed3CXGARS6
— ANI (@ANI) April 27, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి
క్యాన్సర్ రోగులు టీకా వేసుకోవచ్చు
25 మిలియన్ల ప్రేమను పొందిన లాహే లాహే సాంగ్
కరోనా వేళ భారత్కు బాసటగా నిలిచిన ఫ్రాన్స్, కువైట్
పదిమందిలో కలవొద్దు.. బాతఖానీ పెట్టొద్దు..