Ground Water | న్యూఢిల్లీ: ప్రస్తుతం వరి పంటను పండిస్తున్న భూభాగంలో 40 శాతం భూమిలో దానికి బదులు ఇతర పంటలను పండించాలని పరిశోధకులు చెప్పారు. దీనివల్ల ఉత్తరాదిలో 2000 సంవత్సరం నుంచి కోల్పోయిన భూగర్భ జలాల్లో 60-100 క్యూబిక్ కిలోమీటర్ల భూగర్భ జలాలను పునరుద్ధరించవచ్చునని తెలిపారు. ఐఐటీ, గాంధీనగర్ పరిశోధకులు కూడా ఈ బృందంలో ఉన్నారు.
భూమి వేడెక్కడం ఇదే విధంగా కొనసాగితే, ప్రస్తుత పంటల సాగు పద్ధతుల వల్ల 13-43 క్యూబిక్ కిలోమీటర్ల భూగర్భ జలాలను నష్టపోవలసి ఉంటుంది. వరి సాగుకు అత్యధికంగా భూగర్భ జలాలపైనే ఆధారపడతామనే సంగతి తెలిసిందే. పంటల సాగు పద్ధతులను మార్చడం రైతుల లాభదాయకత కూడా పెరుగుతుందని ఈ నివేదిక తెలిపింది. ముఖ్యంగా పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ర్టాల్లో ఈ మార్పులను అమలు చేయాలని సూచించింది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్ వంటి రాష్ర్టాల్లో ప్రభావం చెప్పుకోదగినంతగా ఉండదని ఈ పరిశోధకులు గుర్తించారు.