ఆదివారం 27 సెప్టెంబర్ 2020
National - Aug 11, 2020 , 07:02:22

నేడు తొమ్మిది రాష్ట్రాల సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌

నేడు తొమ్మిది రాష్ట్రాల సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌

హైదరాబాద్‌ : దేశంలో కరోనా  మహమ్మారి ఉధృతి కొనసాగుతున్నది. ఈ క్రమంలో దేశంలో వైరస్‌ ప్రభావం, సంబంధిత అంశాలపై ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించనున్నారు. ఇందులో తెలుగురాష్ట్రాలకు చెందిన సీఎంలు కేసీఆర్, వైఎస్‌ జగన్‌తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు పాల్గొననున్నారు. అలాగే బీహార్, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, పంజాబ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల సీఎంలు, చీఫ్ సెక్రెటరీలతో ఇవాళ ఉదయం 11గంటలకు సమావేశం కానున్నారు.

ప్రధానితో పాటు కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, డాక్టర్‌ హర్షవర్ధన్‌, కిషన్ రెడ్డి, కేబినెట్ సెక్రెటరీ, హోం శాఖ సెక్రెటరీ వీసీలో పాల్గొననున్నారు. సమావేశంలో పెరుగుతున్న కరోనా కేసులు ప్రభావం, కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు సహా పలు అంశాలపై చర్చించనున్నారు. కాగా, దేశంలో కరోనా పాజిటివ్ కేసులు 22లక్షలు పాజిటివ్‌ కేసులు  నిర్ధారణ అయ్యాయి. ప్రస్తుతం 6.34లక్షల యాక్టివ్‌ కేసులుండగా, 15.34లక్షల రోగులు వైరస్‌ నుంచి కోలుకున్నారు. మరో 44వేల మందికిపైగా వైరస్‌ ప్రభావంతో మరణించారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo